ఏంటి బాబు… ఆఫీస్ కు జర్కిన్ వేసుకుని వచ్చావ్.. నీ జర్కిన్ వల్ల ఆఫీస్ లో నీళ్లు పడ్డయి.. నీకు ఇవాళ జీతం కట్.. మేడం చెప్పింది.. నీకు ఫైన్ వేయమంది. ఇవాళ్టి నుంచి ఎవరు జర్కిన్ వేసుకొచ్చినా వారి జీతం కట్ చేయమని ఆర్డర్స్.. అన్నాడట హెచ్ఆర్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండేటోడు.. ఒకేరోజు నలుగురి జీతాలను కోసినమని ప్రకటించిన్రట. ఏ…. మరీ ఇంత చిల్లరగ ఎవ్వరు చేస్తరు అని అనుకుంటున్నరా.. ఉందికదా ఓ చానల్.. ఆ….. అదే.. మీరు ఊహించింది కరెక్టే. సీవీఆర్ చానల్లోనే ఇది జరిగింది. ఇదివరకు ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఆఫీస్ కు తాళం వేసిన్రు. ఇప్పుడు ఇలా జీతం కట్ చేసిన్రు.
ఎక్కడో పశ్చిమగోదావరి, విజయనగరం, చిత్తూరు నుంచి ఇంతదూరం వచ్చి 9వేలు, 10వేల జీతానికి పనిచేస్తున్నరు. అందులోంచి ఒకరోజు జీతం కోస్తే వాళ్ల పరిస్థితి ఏం కావాలె.. వానాకాలం బండి మీద తడవకుండా జర్కిన్ వేసుకోకుంటే ఏం వేసుకుంటరు..