జమ్ముకాశ్మీర్‌లో పాలమూరు జవాన్ మృతి

మహబూబ్‌నగర్ : జల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పిట్టల గోపాల్ జమ్ముకాశ్మీర్‌లోని కార్గిల్‌ వద్ద మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నాగులపల్లి గ్రామానికి చెందిన పిట్టల గోపాల్ 12 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఇన్నాళ్లపాటు మంచిగానే ఉన్నా ఉన్నట్టుండి శనివారం ఉదయం తెల్లవారుజామున ఆర్మీ జవాన్ గోపాల్ మృతి చెందినట్లు అక్కడి నుంచి ఫోన్ లో సమాచారం అందించారు. దీంతో కలవర పడిన కుటుంబీకులు సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమాచారం తెలుసుకున్నారు. జవాన్ గోపాల్ చనిపోయింది వాస్తవమని వారు చెప్పారు. మృతికి గల కారణాలు మాత్రం తెలియటం లేదన్నారు. 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.