జడత్వంలో సీపీఎం

bardan-11– ఆ పార్టీది కాలం చెల్లిన ‘ప్రోగ్రాం’
– మాపై అవాస్తవాలు, అర్ధసత్యాలా?
-సీపీఎంపై సీపీఐ నేత బర్ధన్ ఫైర్
సహచర వామపక్షం సీపీఎంపై సీపీఐ జాతీయ నేత ఏబీ బర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు. ‘జఢత్వం’లో ఉన్న సీపీఎంలో మార్పు రావడం లేదని ఫైర్ అయ్యారు. మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా పార్టీ పంథా, విధానాలను మార్చుకోవడంలేదని, పైగా ఆ పార్టీ సీపీఐపై అవాస్తవాలతో కూడిన ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. సీపీఐకి ‘ప్రోగ్రాం’ లేదంటూ, అది కమ్యూనిస్టు పార్టీయే కాదని.. అర్ధసత్యాన్ని సీపీఎం ప్రచారం చేస్తోందని, వాస్తవానికి కాలం చెల్లిన ‘ప్రోగ్రాం’ ఆ పార్టీదేనని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులతో సీపీఐ ముందుకు సాగుతోందని చెప్పారు. ‘సీపీఐకి ‘ప్రోగ్రాం’ లేదంటున్న సీపీఎం తన ‘ప్రోక్షిగాం’ను రుజువు చేసుకుంటే.. ఆ పార్టీ వెనుకే సీపీఐ వస్తుంది’ అని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి అయిన బర్ధన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా సీపీఎం తన విధానాలను మార్చుకోవాలని సూచించారు. గత జాతీయ మహాసభలో ప్రతిపాదించిన ‘కార్యక్షికమ ముసాయిదా’పై చర్చించేందుకు ఈడ్పుగంటి నాగేశ్వరరావు అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర సమితి శనివారం నిర్వహించిన సమావేశంలో బర్ధన్ మాట్లాడారు.

పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పటికప్పుడు భిన్నమైన పంథాతో ముందుకు సాగినా.. మౌలిక సిద్ధాంతమైన మార్క్సిజం, లెనినిజాన్ని ఏనాడూ విస్మరించలేదని స్పష్టంచేశారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడినా.. ఆయా పార్టీల భావజాలాన్ని ఏనాడూ సీపీఐ అనుసరించలేదని చెప్పారు. ఆలసిపోయిన కొన్ని పార్టీలు రివిజనిస్టు విధానాల్లో భాగంగా అన్ని విషయాల్లో సర్దుకొని పోతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ ఆవశ్యకత, ప్రోగ్రాం రూపకల్పన విషయాన్ని వివరించారు. కమ్యూనిస్టు పార్టీ చీలిక తరువాత 1964లో పార్టీ ప్రోగ్రాం రూపొందించుకున్నామని, నాటి నుంచి నేటివరకూ మార్పులేదని చెప్పారు. ‘ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. కొత్త కొత్త పరిణామాలు, పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా విప్లవం సాధించాలన్న ఆలోచనతో పార్టీ ‘ప్రోగ్రాం’ ముసాయిదా రూపకల్పనపై కమిషన్ వేశాం. అయితే ఆ కమిషన్ ముసాయిదా ప్రకటనను మాత్రమే రూపొందించింది’ అని వివరించారు.

ప్రపంచంలో విప్లవాన్ని సాధించిన దేశాలన్నీ ఒక దేశ విధానాన్ని మరో దేశం అవలంబించకుండా..వేటికవే విధానాలు రూపొందించుకొని సాధించాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ పాలనలో పేదలను విస్మరించాయని, పేద వర్గాల అభ్యున్నతి కోసం, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన దేశంలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదని, మన దేశానికి అనుగుణంగా పంథాను అలవర్చుకోవాలని సూచించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు గమనించి అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి అనుగుణంగా ప్రోగ్రాం రూపొందించుకోవాల్సి ఉంటుందని అభివూపాయపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ..సీపీఐకి ప్రోగ్రాం లేదంటూ.. కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా కార్యక్షికమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరడ్డి పాల్గొన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.