జగన్‌కు ఈడీ నోటీసులు

అక్రమాస్తుల కేసులో పలు ఆరోపణలెదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 17న ఈడీ న్యాయధికార సంస్థ ముందు హాజరు కావాలని జగన్‌ను ఆదేశించింది. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డికి కూడా మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 5న ఈడీ అధికారుల ముందు హాజరుకావాలని ఎమ్మార్, ఎంజీఎఫ్‌లకు అధికారులు నోటీసులు జారీ చేశారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.