జంతర్ మంతర్‌లో జనగర్జన-తొలిరోజు సన్సద్‌ సత్యాగ్రహ దీక్ష గ్రాండ్‌ సక్సెస్‌

 

bjp
ఢిల్లీకి చేరిన సంసద్ యాత్ర
– తెలంగాణ పాటల ఉర్రూతలు
– ఢిల్లీలో మార్మోగిన తెలంగానం
– ‘సత్యాక్షిగహ దీక్ష’ తొలి రోజు సక్సెస్
– పెద్ద సంఖ్యలో వివిధ జేఏసీ నేతల హాజరు
జై తెలంగాణ నినాదాలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ మార్మోగింది. సంసద్ యాత్ర ద్వారా అనుకున్న దానికంటే రెట్టింపుగా తెలంగాణవాదులు ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ పది జిల్లాల నుంచి వేలమంది ఉద్యమకారులు ఢిల్లీకి తరలి రావడంతో తెలంగాణ సత్యక్షిగహ దీక్ష తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజావాణిని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి వినిపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత యూపీఏ ప్రభుత్వానిదేనని, అందుకు కాంగ్రెస్‌కు ఇదే చివరి అవకాశమని జేఏసీ నేతలు హెచ్చరిక చేశారు. సత్యక్షిగహ దీక్షకు వెయ్యి మంది హాజరవుతారని అంచనా వేయగా.. దాదాపు మూడు వేల మంది తరలిరావడంతో టీజేఏసీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. టీజేఏసీ భాగస్వామ్య పార్టీలయిన టీఆర్‌ఎస్, న్యూడెమోక్షికసీలతో పాటు.. జాతీయపార్టీలైన బీజేపీ, సీపీఐ, ఎన్సీపీ, పార్వర్డ్‌బ్లాక్ నేతలు సత్యక్షిగహ దీక్షకు మద్దతు పలికారు. పెద్ద సంఖ్యలో వివిధ జేఏసీల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అపహాస్యం చేస్తూ, వేల మంది తెలంగాణ యువత బలిదానాలకు కారణమవుతున్న కాంగ్రెస్ కళ్లు తెరిపించే ఉద్దేశంతో నిర్వహించిన టీజేఏసీ ఢిల్లీలో నిర్వహించిన ‘సంసద్ యాత్ర-సత్యాక్షిగహ దీక్ష’ మెదటి రోజు విజయవంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన తొలి రోజు దీక్ష సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మెయిన్ స్ట్రీం పత్రిక సంపాదకుడు సుమిత్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై, దీక్షను ప్రారంభించారు. రసమయి బాలకిషన్, అరుణోదయ కళాకారుల బృందాలు శిబిరం వద్ద తెలంగాణ పాటలతో ఉర్రూతలూగించారు. నేతలు, కార్యకర్తలు వారి వారి సంఘాల బ్యానర్లతో ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. అంతకు ముందు సంసద్ యాత్ర కోసం హైదరాబాద్ నుంచి బయల్దేరిన రైలు.. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్‌కు ఉదయం ఆరుగంటలకు చేరుకుంది. వచ్చినవారిని కాలకృత్యాలు తీర్చుకునేందుకు వివిధ హోటళ్లు, విడిది ప్రదేశాలకు తరలించాల్సిన బస్సులు సమయానికి రాకపోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నా.. ఆ తర్వాత సర్దుకుంది. దాదాపు 1500 మందిని విడిది ప్రాంతాలకు తరలించి, తిరిగి దీక్షా స్థలికి ఉదయం పదిగంటలకు తీసుకు వచ్చారు.

సమయానికే మొదలైన దీక్ష
ముందుగా ప్రకటించినట్లు సరిగ్గా 11 గంటలకు దీక్షను ప్రారంభించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, జేఏసీ అధికార ప్రతినిధి సీ విఠల్ అతిథులు, నేతలను వేదిక మీదకు ఆహ్వానించారు. సభా కార్యక్షికమాలను అధ్యక్షవర్గంగా జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీ ప్రసాద్, టీజీవో అధ్యక్షుడు, జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, అడ్వకేట్స్ జేఏసీ కో కన్వీనర్ నల్లపు ప్రహ్లాద్ నిర్వహించారు. ఢిల్లీ జేఏసీ చైర్మన్ రామకృష్ణాడ్డి ప్రారంభోపన్యాసం చేశారు.

హాజరైన ముఖ్యులు
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌డ్డి, ఎన్సీపీ నేత త్రిపాఠి, ఫార్వర్డ్ బ్లాక్ నేత దేవ ప్రసాద్ విశ్వాస్, జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్షికసీ నేత అపర్ణ, ఆర్‌కె తోమర్, ఢిల్లీ యూనివర్శిటీ ఫ్రొఫెసర్ భట్టాచార్య తదితర జాతీయ స్థాయి నేతలు, మేధావులు పాల్గొన్నారు. జేఏసీ భాగస్వామ్యపక్ష పార్టీలు టీఆర్‌ఎస్ నేతలు నాయిని నర్సింహాడ్డి, జీ విజయరామారావు, ఈటెల రాజేందర్, కే తారకరామారావు, సోమారపు సత్యనారాయణ, జూపల్లి కృష్ణారావు, నారదాసు అక్ష్మణ్‌రావు, స్వామిగౌడ్, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, ఏనుగు రవీందర్‌డ్డి, దాసోజు శ్రవణ్, చెరుకు సుధాకర్, పద్మారావు, జితేందర్‌డ్డి, కట్టెల శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీం, మహబూబ్ అలి, పాతూరి సుధాకర్ రెడ్డి, టీఆర్‌ఎస్వీ నేత సుమన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నుంచి బండారు దత్తావూతేయ, విద్యాసాగర్‌రావు, జంగాడ్డి, నల్లు ఇంద్రసేనాడ్డి, కిషన్‌డ్డి, యెండెల లక్ష్మినారాయణ, ఎన్నం శ్రీనివాసడ్డి, వెదిరె శ్రీరాంద తదితరులు హాజరయ్యారు. న్యూ డెమొక్షికసీ నుంచి సూర్యం, గోవర్ధన్, సంధ్యతో పాటు పీడీఎస్‌యూ నేతలు గౌతమ్ ప్రసాద్, ఎం శ్రీనివాస్, రియాజ్, తదితరులు హాజరయ్యారు. జేఏసీకి బయటినుండి మద్దతు పలుకుతున్న సీపీఐ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సీపీఐ రాష్ట్ర నాయకులు గుండా మల్లేష్, చాడా వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా, ఉజ్జిని యాదగిరి రావు తదితరులు కూడా హాజరయ్యారు.

కార్యక్షికమానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు ఎం వేదకుమార్, వెంకట్‌డ్డి, టీడీఎఫ్ నేత డీపీ రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఇంకా ఈ కార్యక్షికమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నేత శ్రీధర్ దేశ్ పాండే, తెలంగాణ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి నాగరాజు, లాయర్స్ జేఏసీ నేతలు ఉపేందర్, గోవర్ధన్‌డ్డి, అశ్వద్థామడ్డి, టీఆర్‌ఎస్ నేత తక్కెళ్లపెల్లి రవీందర్ రావు, కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు సూదగాని వెంక గౌడ్, ఎల్బీనగర్ జేఏసీ చైర్మన్ కేవీ రంగాడ్డి, తెలంగాణ విద్యార్థి జేఏసీ నేతలు గాదరి కిశోర్, పున్నా కైలాష్, రమేశ్ రాజూశ్, తెలంగాణ మహిళా జేఏసీ నేతలు మమత, రేచల్ తదితరులు పాల్గొన్నారు. టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మణిపాల్ రెడ్డి, వెంక రఘు, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, పిట్టల రవీందర్, బాల నర్సయ్య, రసమయి బాలకిషన్, కృష్ణయాదవ్, జ్ఞానేశ్వర్, హమీద్ మహ్మద్ ఖాన్, వెంకట్ రెడ్డి, భిక్షపతి, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ రమేశ్, నల్లా రాధాకృష్ణ, మమత, ఏలూరి శ్రీనివాస రావు, శివాజీ, రవి కుమార్ తదితరులు హాజరయ్యారు.

దీక్షకు హాజరైన సంఘాలు
టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక, టీ అడ్వకేట్స్ జేఏసీ, టీఎల్‌ఎఫ్, తెలంగాణ మాల మహానాడు, ఓయూ విద్యార్ధి జేఏసీ, టీఆర్‌ఎస్వీ, తెలంగాణ నగారా సమితి, తెలంగాణ యునివర్శిటీ ఉద్యోగుల సంఘం, ఓయూ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ డాక్టర్ల సంఘం, డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ, టీఆర్‌టీయూ, విద్యుత్ ఉద్యోగుల సంఘం, అమరవీరుల వేదిక, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి, తెలంగాణ మజ్దూర్ యూనియన్, తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తదితర సంఘాలు పాల్గొన్నాయి. దీక్షకు హాజరైన జిల్లా జేఏసీ కన్వీనర్లలో వెంక (నల్లగొండ), అశోక్ (మెదక్), రంగరాజు (ఖమ్మం), ప్రతాప్‌డ్డి (వరంగల్), వెంకట మల్లయ్య (కరీంనగర్), గోపాల శ్రీహరి (నిజామాబాద్), రామకృష్ణ (మహబూబ్‌నగర్), శ్రీనివాస్ (రంగాడ్డి), శ్రీధర్, కృష్ణయాదవ్ (హైదరాబాద్) తదితరులు ఉన్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరఫున కార్యదర్శులు రాజేశ్, రమేశ్ హజారి, వరంగల్ నుంచి విజయకుమార్, రవికుమార్, రాజేంద్ర ప్రసాద్, ఖమ్మం నుంచి రవి, కుత్బుల్లాపూర్ నుంచి అస్కాన్ మారుతి తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.