ఛీ గీళ్ళదో మాటనా?

ఇగ ఇచ్చుడే నన్నరు
ఇగ తెచ్చుడేనన్నరు
గల్లి గల్లి తిరిగిండ్రు
జబ్బపూగిరేసిండ్రు
ఆడమాదే! గీడమాదే
ఏడైనా! మాదేనన్నరు; మా
మాటకు తిరుగులేదు
మాటంటే’ మాటన్నరు
ఇగ ఢిల్లీ పోవుడే
అడ్గుడే; తెచ్చుడేనన్నరు
రాసుకోంవూడి‘తెలంగాణ’
మా మాటింటది; అమ్మ
ఇత్తది తెలంగాణ; అమ్మ
మొక్కుండ్రి; అమ్మకు
ముడుపులు గట్టుండ్రి; అమ్మకు
ఇగ అచ్చుడే; ఇగ తెచ్చుడే
అనుకుంట ఢిల్లీ పోయిండ్రు
ఏమైందో! ఏమోగాని
తలదించుకొని వచ్చిండ్రు
గిప్పుడు ‘సమయం’ రావాలంటుండు
ఛీగీళ్ళదో మాట; నమ్ముడా?
– డాక్టర్ సంగినేని రవీందర్

This entry was posted in POEMS.

Comments are closed.