ఛార్జీల పెంపును విరమించుకోకుంటే అసెంబ్లీ సెషన్స్ ను అడ్డుకుంటాం-కేటీఆర్

 ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను పెంచడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారక రామారావు ఫైర్ అయ్యారు. ఇప్పటికే ప్రజలు కరెంట్ బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మళ్లీ వారి నడ్డిని విరిచేలా కరెంట్ బిల్లుల పెంపు ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కరెంట్ ఛార్జీల పెంపును విరమించుకోకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. సీఎం కిరణ్‌కు పరిపాలనా అనుభవం లేదని, ఆయన ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, టీఆర్‌ఎస్‌వీ-2013 క్యాలెండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.