‘ఛలో అసెంబ్లీకి అనుమతి కోరాం: కోదండరాం

హైదరాబాద్: తాము ఈనెల 14న నిర్వహించబోయే ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి కోరామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఈనెల ఆరవ తేదీనే పోలీసులకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. కాగా, ‘ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ మాకు ఎలాంటి అప్లికేషన్ రాలేదని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అబద్ధాలాడుతున్నారు’ అని జేఏసీ వైస్ ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య విమర్శించారు. ర్యాలీకి అనుమతినివ్వక పోవడం రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛలో అసెంబ్లీ జరుగకుండా నిర్బంధించి ఉద్యమాన్ని ఆబాసుపాలు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని మల్లెపల్లి దుయ్యబట్టారు. తెలంగాణపై బిల్లుపెడతామని సోనియాగాని, ప్రధాని గాని చెప్పిస్తే ఛలో అసెంబ్లీని వాయిదా వేసుకుంటామని టీజీవోల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.