చేప ప్రసాదానికి పోటెత్తిన ప్రజలు

fish2F -వివాదాలు ముసిరినా.. పెద్దసంఖ్యలో హాజరు
-ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో లాంఛనంగా ప్రారంభం
-సరిపోని ఏర్పాట్లు.. అవస్థలు పడిన రోగులు
అనేక ప్రతిబంధకా లు, వివాదాలు ముసిరినప్పటికీ చేప ప్రసాదానికి ప్రజలు పోటెత్తారు. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శనివారం మధ్యాహ్నం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అస్తమా బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో చేప ప్రసాదంపై ప్రజల విశ్వాసం తగ్గిపోలేదనే విష యం రుజువైంది. బత్తిన హరినాథ్‌గౌడ్ సోదరులు, హరినాథ్ కూతురు అలకనంద కలిసి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమేందర్‌డ్డికి తొలి ప్రసాదాన్ని అందజేసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి చిన్నా, పెద్ద తేడా లేకుండా దాదాపు 50 వేల మంది తరలిరావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం కిక్కిరిసిపోయింది. చేప ప్రసాదం పంపిణీకి 32 కౌంటర్లు ఏర్పాటు చేసినా సరిపోలేదు. దీంతో తీవ్ర తోపులాట జరిగింది. మహిళలు, వృద్ధులు సొమ్మసిల్లిపడిపోయారు. మరోవైపు చేప ప్రసాదం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏమూలకు సరిపోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్షికమం రెండు రోజులపాటు ఆదివారం వరకు కొనసాగుతుంది.

సర్కార్‌కు బుద్ధి లేదు: కొత్త సత్తిడ్డి
‘‘సర్కార్‌కు బుద్ధి లేదు. ఉబ్బసం వ్యాధిక్షిగస్తులకు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తుంటే అన్ని వసతులు కల్పించాలి. దీంతో ప్రయోజనం లేకుంటే రోగులు రారు కదా? సర్కార్‌కు సిగ్గుంటే మద్యం బంద్ చేయించాలి, చేప ప్రసాదం పంపిణీకి మరిన్ని ఏర్పాట్లు చేసి కొనసాగించాలి’’ అని నల్లగొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం, పల్లెపాడుకు చెందిన కొత్త సత్తిడ్డి డిమాండ్ చేశారు.

ప్రయోజనం లేకుంటే పబ్లిక్ ఎందుకొస్తుంది: కథలయ్య
చేప పసాదం తీసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం లేకుంటే పబ్లిక్ ఎందుకొస్తుందని మహబూబ్‌నగర్‌కు చెందిన కథలయ్య అన్నారు. ‘‘ప్రభుత్వ సహకారం ఉంటే మరింత ఫలితం ఉంటుంది. వేలాదిగా వ్యాధిక్షిగస్తులు వచ్చినప్పడు ప్రభుత్వం స్పందించకపోతే ఎలా? ’’ అని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కథలయ్య అన్నారు.

గణేష్ నిమజ్జనం తరహాలో ఏర్పాట్లు చేయాలి: ఘని
‘‘ప్రజల ఆకాంక్ష మేరకు ప్రతి ఏటా గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నదో అదేవిధంగా చేప పంపిణీకి కూడా అదేవిధంగా చేయాల్సి ఉంది. గణేశ్ నిమజ్జనం ఒక మతం వారు మాత్రమే చేసుకుంటారు. కానీ ఈ ఉబ్బసం అనేది అన్ని మతాలు, వర్గాలు, తారతమ్యం లేకుండా వస్తుంది’’ అని రంగాడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లికి చెందిన మహ్మద్ ఘని పేర్కొన్నారు.

ప్రజల సెంట్‌మెంట్‌ను గౌరవించాలి: బాదిమి రవిశంకర్
‘‘అస్తమా రోగులకు చేప ప్రసాదం పని చేస్తుందా? లేదా? అనేది సమస్య కాదు. దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నప్పుడు వారి సెంటిమెంట్‌ను ప్రభుత్వం గౌరవించాలి’ అని జడ్చర్లకు చెందిన బాదిమి రవిశంకర్ ప్రశ్నించారు.

చేప పిల్లలకు బదులు బెల్లం ఉపయోగించాలి
‘‘బత్తిన సోదరులు చేసే ఉచిత చేప ప్రసాదం పంపిణీకి మేం వ్యతిరేకం కాదు ప్రోత్సహించడమూ లేదు. చేపలు తినని వారికి ఎలాగైతే బెల్లంతో ఈ మందు వేస్తున్నారో.. రోగులందరికీ బెల్లంతోనే వేయాలి’’ అని ఏపీ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం అధ్యక్షులు లెల్లెల బాలకృష్ణ అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.