చేపా! నీవైనా నిజాలు చెప్పవా?-ప్రొ.కోదండరాం

బత్తిని సోదరులకు అన్యాయం జరుగుతున్నది. వారు అన్ని వ్యాధులను నయం చేస్తామ ని మోసపూరితంగా డబ్బు సంపాదించ డంలేదు. శాస్త్రం మొత్తం చదివామని డిగ్రీలు పెట్టుకొని స్టార్ హోటళ్ల మాదిరి ఆస్పవూతులు కట్టి సొమ్ము చేసుకుంటలేరు. వారసత్వంగా సంక్రమించిన జ్ఞానం తో మందు తయారు చేసి, నమ్మకంతో వచ్చిన వాళ్లకు ఉచితంగానే ఇస్తున్నారు. ఉచితంగానే ఇవ్వడం వల్ల ఒకసారి ప్రయత్నిస్తే నష్టమేమీ లేదని చాలామంది బత్తిని సోదరులు ఇచ్చే చేపమందు తీసుకుంటున్నరు.

మందుల స్వభావం ఏదైనా వాటి వాడకంలో విశ్వాసాలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు అల్లోపతిలో క్యాన్సర్‌కు ఇచ్చే కొన్ని మందులు చాలా సందర్భాల్లో పని చేయవని తెలుసు. అయినా వాడే వాళ్లు చాలామందే ఉన్నారు. మందు ఇప్పించకపోతే లోకం ఏమనుకుంటుందోనన్న భయంతో కొందరు మందు ‘గుణం’ ఇస్తుందేమోనన్న ఆశతో కొందరు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. సరే అన్ని పేషెంట్‌కు తెలియవు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ తెలిసిన కొన్ని ఆస్పవూతులు ప్రజల బలహీనతలను వాడుకొని వ్యాపారం చేసుకుంటున్నా యి. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

ఒక మందు గురించి మొత్తం తెలిసినా దాని వాడకం హేతుబద్ధంగా ఉంటుందన్న గ్యారంటీలేదు. రైతులు వాడే పురుగులమందులు ఇం దుకు ఉదాహరణ. వాటి వాడకంలో పెట్టుబడి పెరుగుతున్నది. దీర్ఘకాలంలో అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. పంట దిగుబడి కోసం ఆశప డి ప్రజలు విశ్వాసంతో వాడుతున్నారు.ఆ విశ్వాసాలను వాడుకొని కంపెనీలు సొమ్ము చేసుకోవాలనుకున్నప్పు డు, మార్కెట్‌పైన, ఆర్థిక వ్యవస్థపైన ఆధిపత్యాన్ని పొందాలనుకున్నప్పుడు సమాజం జోక్యం చేసుకోవాలి. మందు వాడకానికి సంబంధించిన చర్చలో నైతి క విలువల ప్రస్తావనను వదలకూడదు. శాస్త్రం తెలిసి మోసపూరితంగా వ్యవహరించే కంపెనీలు, సంస్థలకన్నా, వ్యాపారుల కన్నా బత్తిని సోదరులు వేయిట్లు నయం. చేప మందుపై వ్యాఖ్యానించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించాలి.

మందు కంపోజిషన్ ఏమిటన్నది రెండవ విషయం. బత్తిని సోదరులకు అనుభవపూర్వకంగా మందు పనిచేస్తుందని మాత్రమే తెలుసు. అంతకుమించి న ఆధునిక విశ్లేషణ వారికి తెలియదు. బత్తిని సోదరులే కాదు సాంప్రదాయక సమాజం ప్రపంచాన్ని అనుభవం ఆధారంగానే అర్థం చేసుకున్నది. ప్రకృతికి సంబంధించిన జ్ఞానమంతా ఆధునిక శాస్త్రమే పెంపొందించలేదు.మనిషి పుట్టినప్పటి నుంచి ప్రకృతిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రకృతి భగవంతుని సృష్టి కాబట్టి భగవంతున్ని తెలుసుకోగలిగితే ప్రకృతి అర్థమవుతుందనిభావించేవాళ్లు గణనీయమైన సంఖ్య లో ఉన్నారు.

కానీ మతంతో నిమిత్తం లేకుండా ప్రకృతిని తెలుసుకునే ప్రయత్నాలు కూడా ఆది నుంచి ఉన్నాయి. లోకాయతలు ఆ కోవకు చెందినవారే. రోజువారీ జీవితంలో కూడా అనేకరంగాల్లో మనిషి ఈ దృక్పథాన్ని కొనసాగించాడు. మంత్రాలకు చింతకాయలు రాలవన్న సామెత సమాజరీతికి ప్రతీక.

కనుక అనుభవపూర్వకంగా అనేకానేక విషయాలపై మనుషులు సమాచారాన్ని, అవగాహనను పెంపొందించుకున్నారు. రైతులు వ్యవసాయానికి సంబంధించిన జ్ఞానాన్ని నేత కార్మికులు పత్తి గురించి, నేత గురించి, మాదిగ కులస్థుల తోలు గురించి ఈవిధంగానే వివిధ కులాలకు చెందినవారు ప్రకృతిలోని అనేక అంశాల గురించి లోతైన అవగాహనను సంపాదించుకున్నారు. ఈ పద్ధతిలోనే చేప మందు వచ్చింది. అనుభవం ఆధారంగానే రూపొందింది. అనువంశికంగా బత్తిని సోదరులకు చేరుకున్నది. ఆధునిక శాస్త్రం ప్రకృతిని అర్థం చేసుకోవడానికి రెండు విధాలుగా దోహదపడింది. మతానికి ఉన్న ఆధిపత్యాన్ని ఛేదించి హేతువును పూర్తిగా విముక్తి చేసింది. స్వేచ్ఛగా, ధైర్యంగా ఆలోచించగల శక్తినిచ్చింది.మరోవైపు ప్రకృతిని శోధించడానికి కొత్త పద్ధతులను ఆధునిక శాస్త్రం ముందుకు తీసుకొచ్చింది.

ఈ నూతన దృక్పథం మొదట పాశ్చాత్య దేశాలలో పెంపొందినా క్రమంగా మూడో ప్రపంచదేశాలకు విస్తరించింది. ఈ విస్తరణకు తోడ్పడిన మూడో ప్రపంచ దేశాలకు తెచ్చిన పాశ్చాత్య దేశాల పరిజ్ఞానాన్ని మూడో ప్రపంచ దేశాలకు తెచ్చిన పాశ్చాత్య దేశాల సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థలు మూడో ప్రపంచదేశాలపై పాశ్చాత్య దేశాల గుత్త సంస్థల ఆధిపత్యాన్ని స్థాపించడానికి తోడ్పడినాయి.

హరిత విప్లవం ఇందుకు ఉదాహరణ. పంటల ఉత్పత్తిని పెంచడానికి పాశ్చాత్య పరిజ్ఞానాన్ని మూడో ప్రపంచ దేశాలపై అమెరికా బలవంతంగా రుద్దింది. అం దువల్ల స్థానిక పంటలు, స్థానిక వ్యవసాయ పద్ధతులు, పరిజ్ఞానం నిర్లక్ష్యానికి లోనయ్యాయి. అందువల్ల పెట్టుబడి పెరిగి చిన్న, సన్నకారు రైతు లు తీవ్రంగా నష్టపోయారు.
అందుకే స్థానీయమైన జ్ఞానాన్ని చూస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించడం అవసరం. శాస్త్రం స్థానిక వనరులను గుర్తించడానికి, వాటి ప్రయోజనాలను తెలుసుకోవడానికి, స్థానికంగా అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించడానికి తోడ్పడాలి. కానీ ఆబాధ్యతను స్వీకరించే బదులు మూడో ప్రపంచదేశాల శాస్త్రజ్ఞులు చాలామంది పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు.

ఇన్ని శాస్త్రీయ పరిశోధన సంస్థలు ఉండి బత్తిని సోదరులు వాడే మందుపై పరిశోధన చేయకపోవడమే శోచనీయం. ఎక్కడి నుంచో వచ్చిన జర్మనీ శాస్త్రవేత్తలు అందుకు కృషి చేశారే తప్ప మనవారు పట్టించుకోలేదు.తప్పచేసింది ఈ సంస్థలే కానీ బత్తినిసోదరులు కాదు. చైనాలో సాంప్రదాయకంగా వాడే ఆక్యుపంక్చర్ పై పరిశోధన చేసి ఆచికిత్స పద్ధతిని ఆధునీకరించారు. మనదేశంలో ఆప్ర యత్నాలు లేవు. అట్లాంటి ప్రయత్నా లు చేసిన తర్వాత చేప మందు పరిమితుల గురించి మాట్లాడవచ్చు. అట్లాంటి కృషి జరగకుండా దాన్ని మూఢనమ్మకంగా చిత్రీకరించి, హేతువు విముక్తికి అది ఏకైకమైన అవరోధంగా చూపడం మనం కోరుకుంటున్న శాస్త్రానికీ వ్యతిరేకమే.

మరొకవైపు శాస్త్రీయ పరిశోధన పూర్తి గా నిష్ఫాక్షికమైన జ్ఞానాన్ని అందిస్తుందని అనుకోవడం కూడా సరైనది కాదు. పరిశోధనాంశం ఎంపికను, పరిశోధన లో సేకరించే సమాచారాన్ని వ్యక్తుల ఆలోచనలు, అభివూపాయాలు, ఆశయా లు ప్రభావితం చేస్తాయి. సమాచార సేకరణ ఆధారంగా సిద్ధాంతీకరించే ప్ర మాణాన్ని కూడా వ్యక్తిగత భావాలు ప్ర భావితం చేస్తుంటాయి. ఉదాహరణకు నాకు తెలిసిన మేరకు ఈమందుపై పరిశోధన చేసిన సంస్థలు అందులో కార్టిజన్లు లేవని తేల్చి చెప్పారే తప్ప అం దులో ఏమున్నదో చెప్పలేదు. అంటే కార్టిజన్లు మాత్రమే దమ్మును నివారిస్తాయి. వేరొక మందుకు ఆశక్తి లేదని నిర్ధారణకు వచ్చి ఆ ప్రమాణం ఆధారంగా చేప మందును పరిశీలించడం అన్యాయం. చేపమందులో ఉన్నదేమిటో నిర్ధారించి అది ఏవిధంగా పనిచేస్తుందో తేల్చవలసి ఉన్నది.

మనిషి హేతువు విముక్తి, దాని ఆధారంగా సమాజాన్ని నిర్మించుకునే పరిస్థితి రావాలని కోరుకుందాం. ఆ క్రమంలో స్థానిక అనుభవాల ఆధారంగా కలిగిన జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. ఆ జ్ఞానాన్ని సమా జ పునర్నిర్మాణానికి ఏమేరకు ఉపయోగపడితే ఆమేరకు ఉపయోగించుకుందాం. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం గా పనిచేద్దాం. అంతేకాని కార్పొరేట్ సంస్థలను వదిలి, బహుళజాతి సం స్థలను పక్కనబెట్టి పిట్ట మీద బ్రహ్మస్త్రం వేసినట్టు ఎవ్వరికి హానిచేయని బత్తిని సోదరులపై దాడి తగదు.

ప్రొఫెసర్ ఎం. కోదండరాం

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.