చెయ్యికి దెబ్బ.. పొన్నాల బొబ్బ

ఉద్యమకారుడంటే ప్రభుత్వ బెదిరింపులకు, పోలీసుల లాఠీలకు జడవకుండా ముందుకు సాగాలె..  ఒంటిమీద దెబ్బ పడితే ఆ ఉద్రేకాన్ని ఉద్యమవ్యాప్తిపై మళ్లించి విజయగర్వం పొందాలె.

కానీ టీ-పీసీసీ చీఫ్ పొన్నాల మరీ చీప్ గా చిన్నదెబ్బకే వెక్కివెక్కి ఏడ్చిండు. అది పోలీసులు కొట్టిన దెబ్బకూడా కాదు. తోపులాటలో కిందపడి చెయ్యి బెనికిందట. దానికే లచ్చన్న ఏడుపులు, పెడబొబ్బలు పెట్టిండు. అన్నా లచ్చన్నా.. ఓ సారి ఫ్లాష్ బ్యాక్ ల రీల్ ఏస్కో.. జై తెలంగాణ అనమని  మా కేయూ విద్యార్థులు నీ ఇంటి ముందు ధర్నా చేస్తే వాళ్లను పోలీసులతో పిచ్చిపిచ్చిగా కొట్టించినవ్.. నలుగురు పోలీసులు ఒక్క విద్యార్థిని పట్టుకుని లేపి రోడ్డు అవతల పారేస్తే ఆ విద్యార్థికి తలపగిలింది. చేయి, కాలు, ఛాతికి గాయాలయినయి. చాలా మంది విద్యార్థులకు రక్తాలు కారినయి. అయినా వాళ్ల కంటి నుంచి చిన్న నీటి చుక్క రాలేదు. విజయగర్వంతో రక్తం తుడుచుకుని దండుకట్టి మళ్లీ నీపై దండయాత్ర చేసిన్రు. నీ లెక్క ఏడ్వలే..  ఇప్పుడైనా అర్థం చేసుకో ఉద్యమం అంటే ప్రెస్ మీట్ పెట్టడం కాదు. విమర్శలు చేయడం కాదు. ఉద్యమం అంటే గాంధీభవన్ లో కూర్చుండి బిర్యానీ తినుడు కాదు.  దెబ్బలు తినాలె. బూటుకాలు దెబ్బ రుచిచూడాలి.  ఈడ్చి జీపుల పడేస్తే మోచేయి, మోకాలు చిప్పలు కొట్టుకుపోవాలె.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.