చిన్న రాష్ట్రాలతో కమ్యూనిస్టులకు ముప్పన్న ఏచూరి


(పోరుతెలంగాణ శ్రీనివాస్‌) : చిన్న రాష్ట్రాల డిమాండ్‌లు, ప్రాంతీయ వాదాలతో కమ్యూనిస్టు పార్టీల విస్తరణ, పోరాటాలకు ముప్పు ఏర్పడుతోందని సీపీఎం అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నడు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల డిమాండ్‌లు ఉన్నాయని.. కుల, మత, ప్రాంతీయ ప్రాతిపధికన రాష్ట్రాలను విడదీయకూడదని, భాషా ప్రయుక్త రాష్ట్రాలే జాతీయతను కాపాడుతాయని ఆయన అన్నారు. రాష్ట్రాల విభజనతోనే దేశంలో కమ్యూనిస్టులు బలహీనం అవుతున్నారని వ్యాఖ్యానించారు.  ఏచూరి ఎర్రి డ్యాష్‌ స్టోరీలు మానుకో.. భాషా ప్రయుక్తం పేరుతో ఇంకెంతకాలం తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటరు. ప్రజల పోరాటాలను, బాధలను అర్థం చేసుకోలేని నీది ఓ పార్టీ.. నువ్వో నాయకుడివి.. థూ….  మీ కమ్యూనిజానికి అగ్గితలగ..  వెయ్యి మంది తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేసుకుంటుంటే మీకు కొంచెమైనా జాలి కలగడంలేదా? ఇంత దుర్మార్గమా? ఇదేనా మార్క్సిస్ట్ సిద్ధాంతం. మార్క్స్‌ పేరును వాడుకొని మలినం చేయకండి.. మీరు ఏనాడో మూర్క్సిస్టులుగా మారిపోయిన్రు. చిన్న రాష్ట్రాలతో కమ్యూనిస్టులకు ముప్పు ఎట్లయితది. తెలంగాణ కోరుతున్న సీపీఐ పార్టీ ఎంతో బలపడింది. సీపీఎం మూర్ఖపు సిద్ధాంతాలు.. మూర్ఖపు నేతల వల్ల మనుగడ కోల్పోయింది.  మిస్టర్‌ ఏచూరీ చిన్న రాష్ట్రాలు ఏర్పాటైనా.. కాకున్నా సీపీఎం పార్టీ నిత్యం బికారే.. తెలంగాణ ప్రజల పాపం తగిలిపోతరు.  పోరాటాలతో ప్రజల్లో ఉండే పార్టీలే బలపడతయి.. పైసలు వసూలు తప్ప  ప్రజాభీష్టాలను పట్టించుకోని మీ పార్టీ సత్యనాశనమైపోతది. కమ్యూనిస్టులు వర్థిల్లాలి.. సీపీఎం నశించాలి.. జై తెలంగాణ

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.