చానళ్లు నడుపుతున్నరా.. బ్లాగులు నడుపుతున్నరా?

సీమాంధ్ర చానళ్లు తిట్టొద్దని ఎంత కంట్రోల్ చేసుకున్నా ఈ చానళ్లు చేసే ఫాల్తు పనులను చూసి ఏ తెలంగాణ బిడ్డా తిట్టకుండా ఉండలేదు. పొద్దటి నుంచి  ఎన్టీవీ, టీవీ9 చానళ్లు తెలంగాణ మీద అష్టదరిద్రపు చర్చలతో వక్రీకరణలు చేసినయ్. ఎన్టీవీ,. ఏబీఎన్ లోనూ రిపోర్టర్ల చెత్త కామెంట్స్. కొమ్మినేని,  టీవీ9 రజనీకాంత్ చెత్త డిస్కషన్స్  టీవీ9లో ’ఒక చోట షాక్-మిగతా చోట్లలో మాజీల గెలుపు‘ అని ఇచ్చిన్రు. ఈ చానళ్లేవి మూడు చోట్ల డిపాజిట్ కోల్పోయిన టీడీపీ గురించి, ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ల గురించి ఇవ్వలేదు. ఏమయా మీరు చానళ్లు నడుపుతన్నరా? బ్లాగులు నడుపుతున్నరా? మీ  పైత్యం తగలెయ్య, మీ సీమాంధ్ర పైత్యం చెర్లబడ. కొంచెం కూడా విలువలు లెవ్వా మీకు. డిపాజిట్లు గల్లంతయిన మీ చంద్రబాబు మీద నెగిటివ్ స్టోరీలు కొట్టకుండా గెలిచిన తెలంగాణ పార్టీలపై కొడతారేంటి. బీజేపీ ేమన్నా సమైక్యపార్టీనా అది గెలిస్తే సమైక్యవాదం గెలిచినట్టా? బీజేపీ తెలంగాణ పార్టీ అని తెల్వదా మీకు? తెలంగాణ పార్టీల మధ్య చిచ్చుపెట్టి పైశాచికానందం పొందాలనుకుంటున్నరా? మీరు ఇంతగనం క్యాంపెయిన్ చేసినా తెలంగాణవాదం ఓడుతలేదని మీ కసి. ఆ కసిని ఇట్ల వెళ్లగ్కుతున్నరు. ఈ మాత్రం దానికి చానళ్లెందుకు మీకు. ఓ బ్లాగు పెట్టుకోని రాసుకోండి.

This entry was posted in MEDIA MUCHATLU.

One Response to చానళ్లు నడుపుతున్నరా.. బ్లాగులు నడుపుతున్నరా?

  1. chandra says:

    thats true, villaku maro million march avasaram vundi.