చలో సంసద్ యాత్ర

 

jac– సికింవూదాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీకి బయల్దేన తెలంగాణవాదులు
-జెండా ఊపి యాత్రను ప్రారంభించిన కోదండరాం
– ఎన్డీయేతోనే తెలంగాణ: కిషన్‌డ్డి
తెలంగాణ రణ నినాదం చేయడానికి తెలంగాణవాదులు భారీఎత్తున ఢిల్లీకి కదిలారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలకు నిరసనగా టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమ, మంగళ (29, 30 తేదీల్లో) సంసద్ యాత్ర పేరుతో చలో ఢిల్లీ కార్యక్షికమాన్ని చేపట్టింది. ఇందులోభాగంగా శనివారం సాయంత్రం సికింవూదాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో దాదాపు 2 వేల మంది తెలంగాణవాదులు ఢిల్లీకి బయల్దేరారు. ఈక్రమంలో సికింవూదాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంగణం జై తెలంగాణ.. జై జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది.

తెలంగాణ ఎన్జీవోలు, టీజీవోలు, తెలంగాణ ఉద్యమకారులు, ఆర్టీసీ జేఏసీ, టీఎల్‌ఎఫ్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, అమరవీరుల కుటుంబాల వేదిక, నియోజకవర్గ జేఏసీలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, న్యూ డెమోక్షికసి కార్యకర్తలు ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. వీరికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి, తెలంగాణ నగారా సంస్థ అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి, టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు దేవీవూపసాద్‌రావు, ప్రధాన కార్యదర్శి రవీందర్‌డ్డి, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌లు వీడ్కొలు పలికారు. ఈ సందర్భంగా జెండా ఊపి యాత్రను కోదండరాం ప్రారంభించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ నినాదాలతో కేంద్రంలో వణుకుపుట్టిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు ఉద్యమం నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్ర నాయకులు నేటికీ తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ నాయకులకు కనువిప్పు కలిగేలా సంసద్ యాత్ర చేపడుతామన్నారు. సీమాంధ్ర ప్రభుత్వాలు, నాయకులు తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకుంటున్నారని వారికి రాబోవు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కిషన్‌డ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపె ఉద్యమించాలని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడితే ఎన్డీయే మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే తెలంగాణ తప్పక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. నాగం జనార్దన్‌డ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఇచ్చినట్లే ఇచ్చి మోసం చెసిందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు. దేవీవూపసాద్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెర బాధ్యతనుంచి కేంద్రం తప్పుకుంటుందని ఆరోపించారు. ఉద్యమంతో ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు.

సకల జనుల సమ్మె చరిత్ర సృష్టించిందని.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే ఆ చరివూతను మళ్లీ పునరావృతం చేస్తామని హెచ్చరించారు. టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశాయని విమర్శించారు. అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ జేఏసీ పిలుపు మేరకు సంసద్ యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. విఠల్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించేవరకు ఉద్యోగులు పోరాడుతూనే ఉంటారని తెలిపారు. కార్యక్షికమంలో సలీమొద్దీన్, వెంక రామినేని శ్రీనివాస్‌రావు, బుచ్చిడ్డి పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.