చలో అసెంబ్లీకి చీమలదండులా రావాలి

-అనుమతివ్వకపోయినా చలో అసెంబ్లీ జరిపి తీరుతాం

-అమరుల సాక్షిగా తెలంగాణవాదులు సత్తాచాటాలి
-తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కు
-వాయిదా తీర్మానంపై టీడీపీ ఎందుకు కలిసి రాలేదు?
-స్పీకర్ హోదాలో తెలంగాణను అడ్డుకున్నది సీఎం కిరణే
-చలో అసెంబ్లీ సన్నాహక సదస్సులో కోదండరాం ఆగ్రహం
-ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కితగ్గం
-ఎన్నికల్లో ఓట్లేసేది ప్రజలే, పోలీసులు కాదు: కిషన్‌డ్డి
‘ప్రభుత్వం బారికేడ్లు అడ్డం పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలనుకుం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో అసెంబ్లీకి చీమల దండులా కదిలిరావాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు నియోజకవర్గాలకొక సెంటర్‌ను గుర్తించి త్వరలోనే జేఏసీ ప్రకటిస్తుంది. ఆయా సెంటర్ల నుంచి పెద్దఎత్తున చలో అసెంబ్లీకి తరలిరావాలి’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్వర్యంలో సికింవూదాబాద్‌లోని కేజీఆర్ గార్డెన్‌లో, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్ క్లాసిక్‌గ్డాన్‌లో చలో అసెంబ్లీ సన్నాహక సదస్సు నిర్వహించారు. సదస్సుల్లో కోదండరాం మాట్లాడుతూ చలో అసెంబ్లీ కార్యక్షికమం ఎవరిపైనా యుద్ధం చేయడానికి కాదని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను చెప్పి న్యాయం కోరడానికేనని వెల్లడించారు.

తామేమీ దొంగతనానికి, దౌర్జన్యానికి వెళ్లడం లేదని, శాంతియుతంగా వెళ్తామంటే అనుమతి ఇవ్వకుండా నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. అనుమతిచ్చినా, ఇవ్వకపొయినా చలో అసెంబ్లీ జరిపి తీరుతామని గుర్తుంచుకోవాలన్నారు. అమరుల సాక్షిగా తెలంగాణవాదులు చలో అసెంబ్లీలో పాల్గొని సత్తా చాటాలని కోరారు. ఇంటి వద్ద ఎవరు అరెస్టులు కావొద్దని, అలా చేస్తే ఉద్యమానికి ద్రోహం చేసిన
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీ నాటకాలు తెలంగాణ విషయంలో కాంగ్రెస్, డీటీపీలు దొందూదొందేనని కోదండరాం మండిపడ్డారు. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కైందని, తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలకు అండగా నిలుస్తోందని దుయ్యబట్టారు. చలో అసెంబ్లీకి అనుమతివ్వాలని, తెలంగాణపై తీర్మానం చేయాలని సోమవారం సభలో టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ వాయిదా తీర్మానానికి పట్టుపడుతుంటే టీడీపీ ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు.

టీడీపీ కలిసొస్తే కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరిగేదన్నా రు. అలా చేయకుండా కేంద్రానికి లేఖలు రాశామని, తెలంగాణకు వ్యతిరేకం కాదని చేబితే ప్రజపూలా నమ్ముతారన్నారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలు నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. సీఎం కిరణ్, చంద్రబాబు కలిసి తెలంగాణను మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన బిడ్డల కుటుంబాలను ఏనాడైనా చంద్రబాబు పరామర్శించాడా? కనీసం సంతాపమైనా తెలిపాడాని ప్రశ్నించారు. సీఎం కిరణ్ తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టకుండా కేంద్రం మెప్పు పొందేందుకు పాకులాడుతున్నారన్నారు.

బీజేపీ సత్తా ప్రభుత్వానికి చూపించాలి: కిషన్‌డ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
‘ప్రభుత్వం బైండోవర్లు, అరెస్టులతో బెదిరించినా చలో అసెంబ్లీపై వెనక్కి తగ్గేదిలేదు. బలగాలతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సీఎం తగిన మూల్యం చెల్లించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లేసేది ప్రజలే, పోలీసులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కుంది. టిబెట్‌లో ప్రజాందోళనకు అక్కడి ప్రభు త్వం తలొంచింది. నాలుగు కోట్ల ప్రజల అకాంక్ష కోసం చలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతినివ్వాలి. కాంగ్రెస్ మోసపూరిత విధానాలకు పాల్పడితే ప్రజలు క్షమించరు. ఓటుతో బుద్ధి చెబుతారు. వరంగల్‌లో అరెస్టు చేసిన పిట్టల రవీందర్‌ను విడుదల చేయాలి. చలో అసెంబ్లీని పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి’ అని కిషన్‌డ్డి పిలుపునిచ్చారు.

ప్రజలు అరెస్టులు, తూటాలకు భయపడరు: వీ శ్రీనివాస్‌గౌడ్, టీజీవో అధ్యక్షుడు
రాష్ట్ర సాధనలో ప్రతి తెలంగాణవాది ముందుండి పోరాడాలి. చలో అసెంబ్లీకి జిల్లాల నుం చి తరలి వచ్చే తెలంగాణవాదులను ఎక్కడికక్కడ అరెస్టులు, బైండోవర్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అరెస్టులు, తూటాలకు భయపడరు. విద్యార్థులు, యువత, మహిళలు భారీగా తరలిరావాలి. కార్యక్షికమాల్లో గ్రేటర్ జేఏసీ చైర్మన్ శ్రీధర్, కన్వీనర్ కృష్ణయాదవ్, గోవర్ధన్‌డ్డి, టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి సత్యనారాయణ, బండారు దత్తావూతేయ, కే లక్ష్మణ్, బద్దం బాల్‌డ్డి, వెంకట్‌డ్డి పాల్గొన్నారు.

గ్రేటర్‌లో జోరుగా సన్నాహక సదస్సులు
చలో అసెంబ్లీని విజయవంతం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్‌లో సన్నాహకాలు ఊపందుకున్నాయి. జిల్లాల నుంచి తరలివచ్చే తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేస్తుండడంతో జేఏసీ, భాగస్వామ్య పార్టీలు నగరంపైనే దృష్టి కేంద్రీకరించాయి. రాజధాని నుంచి భారీగా జనసమీకరణ చేసే ఉద్దేశంలో భాగంగా సన్నాహక సదస్సులు భారీగా నిర్వహిస్తున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ జేఏసీ ఆధ్వర్యంలో హేమావతినగర్ కమ్యూనిటీ హాల్‌లో సన్నాహక సమావేశం ఏర్పాటుచేశారు. మల్కాజిగిరి పరిధిలోని గౌతమ్‌నగర్ డివిజన్ టీఆర్‌ఎస్ కార్యాలయంలో చలో అసెంబ్లీ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈసీఐఎల్ జేఏసీ కన్వీనర్ సీహెచ్ బాలనర్సింహ, జీటీసీ కృష్ణ ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాప్రా సర్కిల్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బేతాళ బాలరాజు, చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నాగిళ్ల బాల్‌డ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ ఇన్‌చార్జి బేతి సుభాష్‌డ్డి వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఖాజాగూడలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.