చర్చ ముగిసింది.. అభిప్రాయాలు పంపుతా: స్పీకర్

* సీఎం తీర్మానం ఆమోదం.. అసెంబ్లీ నిరవధిక వాయిదా
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ ముగిసింది. చివరిరోజు అత్యంత ఉత్కంఠ వాతావరణంలో స్పీకర్ నాదేండ్ల మనోహర్ శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర ఏర్పాటులో అసెంబ్లీ పాత్రకు తెరపడింది. ఇక తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ సీఎం కిరణ్ ఇచ్చిన నోటీసును మూజువాణి ఓటుతో అమోదించినట్లు స్పీకర్ వెల్లడించారు. తీవ్ర గందరగోళం మధ్య తూతూ మంత్రంగా క్షణాల్లో వ్యతిరేక తీర్మాన ప్రక్రియను స్పీకర్ ముగించారు. బిల్లుపై మొత్తం 86 మంది సభ్యులు మాట్లాడినట్లు, 9072 సవరణలు అందాయని స్పీకర్ తెలిపారు. సభ అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపుతానని వెల్లడించారు. టీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సీఎం ఇచ్చిన తీర్మానాన్ని కూడా ఒక అభిప్రాయంగా పరిగణిస్తూ రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్ చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.