చంద్రవదన్ కమిటీని బహిష్కరిస్తున్నాం: అల్లం

తెలంగాణ ఉద్యమం పై విషం చిమ్మిన కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమాపై ప్రభుత్వం నియమించిన కమిటీని బహిష్కరిస్తున్నట్లు టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, దర్శకుడు ఎన్ శంకర్ తెలిపారు. సినిమా మొత్తం తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నపుడు దాన్ని చూసి సలహాలు ఏమిస్తామని అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి వచ్చిన జర్నలిస్టులు, టీజేఏసీ నాయకులు, తెలంగాణ ప్రాంత సినీ కళాకారులు, న్యాయవాదులు, మేథావులు ఈ నిర్ణయంతో ఏకీభవించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.