చంద్రబాబు బహురూపులోడు: ఈటెల

 స్కాంల ప్రభుత్వానికి చంద్రబాబు అండగా నిలబడ్డాడని, కేవలం గద్దెనెక్కడానికే కళంకిత మంత్రులను తొలగించాలంటూ ఢిల్లీ గల్లీల్లో తిరుగుతున్నాడని, బాబు బహురూపులోడని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు గతంలో టీఆర్‌ఎస్ అవిశ్వాసం పెడితే టీడీపీ మద్దతు ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు. పరోక్షంగా ప్రభుత్వాన్ని కాపాడిన బాబు మంత్రులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించడం సిగ్గుచేటన్నారు.

మంత్రులు, ప్రభుత్వం వేరుకాదని, ప్రభుత్వాన్ని విమర్శించడం మరిచి కేవ లం మంత్రులపైనే దృష్టి సారించడంతో ఆయన లక్షణమేమిటో అర్థమవుతోందన్నా రు. అవసరమైతే మళ్లీ ప్రభుత్వాన్ని కూల్చుదాం దా అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలపై వివక్ష చూపుతున్న కాంగ్రెస్ మట్టి కొట్టుకపోతుందని జోస్యం చెప్పారు. బయ్యారం గనులు ఎప్పటికైనా తెలంగాణ ప్రజల హక్కేనని, రాబోయే ఎన్నికల్లో ప్ర జలంతా తెలంగాణవాదానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. మన ఓటును మనమే వేసుకొని తెలంగాణ సత్తాను వ్యతిరేక పార్టీలకు చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.