చంద్రబాబు ఆల్‌ఫ్రీ బాబుగా మారాడు: పాల్వాయ్

నల్లగొండ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆల్‌ఫ్రీ బాబుగా మారాడని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్దన్‌రెడ్డి విమర్శించారు. పాదయాత్రలో చంద్రబాబు పొంతనలేని వాగ్ధానాలు చేస్తున్నారని , ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కిలోమీటర్లు నడిచినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు.  వైఎస్సార్సీపీ దొంగల పార్టీ అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే ఆపార్టీ పుట్టుకొచ్చిందని నిప్పులు చెరిగారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్‌కు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ లబ్ది పొందుతున్నారని, పబ్బం గడుపుకుంటున్నారని వివరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.