చంద్రబాబుపై ఈటెల ఆగ్రహం

హైదరాబాద్: కేసీఆర్ వ్యవసాయంపై చంద్రబాబు వెకిలి మాటలు మాట్లాడుతున్నాడని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పుట్టింది, పెరిగింది వ్యవసాయ కుటుంబంలోనే అని వివరించారు. ఆయన మట్టిని నమ్ముకున్నాడని తెలిపారు. కేసీఆర్‌పై ఎవరెంత విషం కక్కినా ప్రజలు నమ్మరని తెలిపారు. ఉద్యమాన్ని ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలతో అపహాస్యంపాలైన నేత చంద్రబాబు అని దుయ్యబట్టారు. వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అంటే వ్యవసాయం పండుగ అని కేసీఆర్ నిరూపించారని ఈటెల వివరించారు. కంప్యూటర్ యుగమైనా, రాకెట్ యుగమైనా అన్నం వచ్చేది మాత్రం వ్యవసాయం నుంచే అని పేర్కొన్నారు. సామాన్య ప్రజల బతుకులను చంద్రబాబు అర్థం చేసుకోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో కరెంట్ బిల్లులు తగ్గించమని ధర్నా చేస్తే బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించి చంపించాడని ఆరోపించారు. కరెంట్ కూడా సరిగా రాక చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ముగ్గురు రైతులను పొట్టన బెట్టుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. రైతులను ఆత్మహత్యలకు పురికొల్పింది బాబేనని స్పష్టం చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు వర్షాలు పడలేదని తెలిపారు. టీడీపీ అధినేత, టీడీపీ పార్టీ తిరస్కరించబడ్డ పార్టీ తిరస్కరించబడ్డ నాయకుడు అని ఆయన అన్నారు.

రెండువేల కోట్లకు బాబు ఎలా ఎదిగాడు? ఈటెల
తనకు రెండెకరాల భూమి తప్ప ఏమీలేదని అన్నటువంటి చంద్రబాబు ఇవాళ రెండువేల కోట్లకు ఎలా ఎదిగారని ఈటెల ప్రశ్నించారు. తన కుమారుని తల్లి నుంచి ఆస్తి వచ్చిందని చంద్రబాబు బుకాయించాడని విమర్శించారు. చంద్రబాబు వ్యాపారాన్ని నమ్ముకున్నారని, కేసీఆర్ వ్యవసాయాన్ని నమ్ముకున్నారని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.