చంద్రబాబుది నీతిమాలిన చర్య : కేటీఆర్

నల్లగొండ : విభజన ఆపాలని కోరుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు చంద్రబాబు లేఖ రాయడం నీతిమాలిన చర్య అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. జగన్ చంద్రబాబులది అవకాశవాదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమించుకున్న వక్ఫ్ బోర్డు భూములు, దోపిడీ కోటలు కూలుతాయనే సీమాంధ్రులు వితండవాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణవాదులపై కేసులు పెట్టించి.. వేధించిన టీ మంత్రులు జైత్రయాత్రలు చేయడం సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు. కేసీఆర్ ఉద్యమం చేయడం వల్లే జిల్లాకో యూనివర్సిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరిగేలా కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నారని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.