చంద్రన్న, రాజన్నలతోనే బాబ్లీ కుంపటి: కేటీఆర్

 చంద్రన్న, రాజన్న రాజ్యాల నిర్లక్ష్య ఫలితమే తెలంగాణకు బాబ్లీ కుంపటి అని టీఆర్‌ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. బాబ్లీ పాపం చంద్రన్న, రాజన్నలదేనని, ఆ ఇద్దరి నిర్లక్ష్యమే తెలంగాణకు శాపంగా మారిందని శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సీఎం కిరణ్ స్పందించి అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధా నికి వాస్తవ పరిస్థితులను వివరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కాగా, బాబ్లీ ప్రాజెక్టు పనుల సర్వే టీడీపీ హయాంలోనే జరిగిందని, అప్పు డు కలత చెందని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని వరంగల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.