గ్రేటర్ టీఆర్‌ఎస్ చీఫ్‌గా కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు టీఆర్‌ఎస్ అధినే కేసీఆర్ చర్యలు ముమ్మరం చేశారు. ఎన్నికలెప్పుడొచ్చినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకునే విధంగా పార్టీని బలోపేతం చేయాలని కేడర్‌ను ఆదేశించారు. సికింద్రాబాద్ లో బలాన్ని పెంచుకొనేందుకు పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించేందుకు వీలుగా పద్మారావుకు ఊరట కలిగించిన్రు.  గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌ను నియమించిన్రు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఇన్‌చార్జీలను నియమించినట్లు జగదీష్ రెడ్డి, నాయిని తెలిపిన్రు. ఏప్రిల్ 19 నుంచి 2, 9, 12, 19 తేదీల్లో బస్తీబాట నిర్వహించనున్నట్లు చెప్పిన్రు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.