గెజిట్‌లో తెలంగాణ హక్కులకు చిల్లులు

కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.. మహాభాగ్యం, హైదరాబాద్‌ను తెలంగాణకే ఇచ్చింది.. జన్మధన్యం, గెజిట్ వచ్చింది.. కొత్త చరిత్ర మొదలైంది.. ఇదీ సగటు తెలంగాణవాసి ఆనందం. కానీ ఆరవై ఏళ్ల కలల పంటగా వెలువడ్డ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ గెజిట్ శ్రద్ధగా చదివితే అసలు రహస్యం బట్టబయలవుతుంది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటులో విధించనన్ని ఆంక్షలు, నిబంధనలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం చివరకు ప్రభుత్వరంగ సంస్థలను కూడా త్రిశంకుస్వర్గంలో ఉంచేసింది. హైదరాబాద్ ఆంక్షలు, హైకోర్టు, విద్య, నదీ జలాలు, శాంతి భద్రతలు, ఉద్యోగాలు, అన్నింటినీ పదేళ్లు ప్రశ్నార్థకంలో ఉంచిన కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను కూడా పదేళ్లు సస్పెన్స్‌లోనే పెట్టింది. చివరకు తెలంగాణ రాష్ర్టాన్ని ఓ దేవతావస్త్రంగా మార్చేసింది.

Singlenprntరాష్ట్ర పునర్వ్యవస్థీకరణ గెజిట్‌లో తెలంగాణ హక్కులకు చిల్లులు పడ్డాయి. కేంద్రం తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి అధికారాలకు కత్తెర పెట్టింది. తెలంగాణలోని ప్రభుత్వరంగ సంస్థలపై ఇష్టానుసారం వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ను పరిశీలించినకొద్దీ విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఏదైనా ఒక రాష్ట్రం విడిపోయినపుడు ఆయా రాష్ర్టాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలపై అక్కడి ప్రభుత్వాలకే పూర్తిస్థాయి అధికారాలు కల్పించడం రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియ. సుమారు అన్ని రాష్ర్టాల ఏర్పాటులోనూ ఇదే పద్ధతి అవలంబించారు. కానీ తెలంగాణ విషయంలో కేంద్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. గెజిట్‌లోని షెడ్యూల్ 10లో పేర్కొన్న 107 ప్రభుత్వరంగ సంస్థలపై ఏడాదిపాటు ఉమ్మడి అధికారాన్ని రెండు రాష్ర్టాలకు కట్టబెట్టింది. సరిపెట్టుకోవచ్చుననుకున్నా.. ఆ తర్వాత రెండు రాష్ర్టాల సంస్థలు వేర్వేరుగా ఏర్పడటానికి గరిష్ఠ కాలపరిమితిని పదేళ్లుగా నిర్ణయించింది. అంటే పదేళ్ల తర్వాతగానీ అవి తెలంగాణ ప్రభుత్వం పరిధిలోకి రావు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ తేదీనుంచి ఏడాదివరకు సంస్థలు యథావిధిగానే కొనసాగుతాయి.

విభజన కోసం ఏర్పాటుచేసిన కమిటీ ఏడాది వరకు తన నివేదికను సమర్పించవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది అనంతరం వేర్వేరుగా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఈ సంస్థల విభజనకు కనీస కాలపరిమితి ఒక ఏడాదిగా…గరిష్ఠ కాలపరిమితిని పదేళ్లుగా నిర్ణయించడమే వివాదంగా మారనుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక రాష్ట్ర పరిధిలో ఉన్న 107 సంస్థలపై పొరుగు రాష్ర్టానికి కూడా హక్కు కల్పించడం విడ్డూరంగా కనిపిస్తోంది. వీటిలో అనేకం పాలనారంగంలో అత్యంత ఆవశ్యకమైనవి. కీలకమైనవి కూడా.

అన్నింటా కేంద్ర పెత్తనమే..
రూల్ 1 అపాయింటెడ్ తేదీనుంచి ఏడాదివరకు ఈ సంస్థల నిర్వహణ ప్రస్తుతం ఉన్న తరహాలోనే యథావిధిగా కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఉమ్మడి నిర్వహణ విషయంలో అటు తెలంగాణ..ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలు సమన్వయంతో ఒక అంగీకారానికి రావాల్సి ఉంటుంది. వీటిపై రెండు రాష్ర్టాలకు సమాన హక్కులు ఉంటాయి. ఇరు రాష్ర్టాలు పరస్పర అంగీకారానికి రాని పక్షంలో కేంద్ర ప్రభుత్వం జోక్యంచేసుకొంటుంది. నీటి ప్రాజెక్టుల మాదిరిగానే ఈ సంస్థలపై కేంద్రం పెత్తనం చెలాయించే ఆస్కారం ఏర్పడింది. దీనితో కేంద్రం అజమాయిషీ చెలాయించే ప్రమాదముంది. ప్రెస్ అకాడమీ మొదలుకొని పోలీస్ అకాడమీ వరకు, ఇంటర్‌బోర్డునుంచి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వరకు పరిశోధనా సంస్థలు, శిక్షణ సంస్థలు, యూనివర్సిటీలు, బోర్డులు…ఇలా ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ సంస్థలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి పగ్గాలు లేకుండా చేశారు.

సీమాంధ్రుల లొల్లితోనే…
రాష్ట్ర విభజనతో తమకు అన్యాయం జరుగుతోందంటూ సీమాంధ్రులు గాయిగాయి చేసి అనేక హక్కులు సాధించడంతో విజయం పొందారు. తెలంగాణ రాష్ట్రం సాధించినా హక్కులు ఆమడ దూరంలోనే ఉండిపోయాయి. వాళ్ల లాబీయింగ్‌కు తలొగ్గి కేంద్రం గెజిట్‌లో అలవికాని..అమలుకు నోచని ఆంక్షలు, షరతులు విధించడం తెలంగాణ రాష్ట్ర హోదాకు భంగం కలిగించే విధంగా ఉందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గెజిట్‌లో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థల వివరాలు..
తెలంగాణలోని సంస్థలు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్,ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్,ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ , డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ , రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థ,సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఎలిమినేటి మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, శ్రీరామనంద తీర్థ శిక్షణ, పరిశోధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్,ట్రైబల్ కల్చర్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్,బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్

ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, సెంటర్ ఫర్ ఫారెస్ట్ అండ్ నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ కారోమాటిక్ ప్లాన్స్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అర్బన్ సర్వీసెస్ ఫర్ ది పూర్, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, ఆంధ్రప్రదేశ్ రూరల్ లైవ్‌లీ హుడ్ ప్రాజెక్ట్, వాటర్ కన్జర్వేషన్ మిషన్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్,

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఏపీఆర్‌ఇఐ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్,సాయిల్ కన్జర్వేషన్ ట్రైనింగ్ సెంటర్, స్టేట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఇన్ హైదరాబాద్, మహత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్,హిందీ అకాడమీ, తెలుగు అకాడమీ, సంస్కృత అకాడమి, ఓరియంటల్ మానుస్క్రిప్ట్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్చివ్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ టెక్నాలజీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ,

తెలుగు యూనివర్సిటీ, డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ విద్యా మిషన్( సర్వ శిక్షా అభియాన్) అథారిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ఫ్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జి నెట్‌వర్క్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్, ఆంధ్రప్రదేవ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్, ది సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్, డైరాచ్యువల్ మారిఫ్, ఓయూ, ఆంధ్రప్రదేవ్ స్టేట్ హజ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ, ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్, ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్,

రాజీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ మిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ, స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీ, ది అంబేద్కర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, విక్టోరియా మెమోరియల్ హోం, ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, డాక్టర్ వైఎస్సార్ స్టడీ సర్కిల్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, ఆంధ్రప్రదేశ్ వుమెన్స్ కమిషన్, వీవర్స్ ట్రైనింగ్ సెంటర్, పవర్‌లూం సర్వీస్ సెంటర్ సిరిసిల్ల, ఖాదీ గ్రామోద్యోగ మహా విద్యాలయ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ అడ్వయిజరీ బోర్డు, స్టేట్ కమిషన్ ఫర్‌ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్,

ది ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ ఆప్ విజువల్లీ హాండిక్రాఫ్ట్స్, స్టడీ సర్కిల్ ఫర్ డిజేబుల్డ్ ఆంధ్రప్రదేశ్, ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, ట్రక్ ఆపరేటర్స్ హైవే అమినిటీస్ సొసైటీ, నేషనల్ క్రెడిట్ కార్ప్స్ డైరెక్టరేట్, శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కల్చరల్ సొసైటీ, డాక్టర్ వైఎస్సార్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్.
సీమాంధ్రలోని సంస్థలు..స్టేట్ అనిమల్ హస్బెండరీ ట్రైనింగ్ సెంటర్, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిషరీస్ టెక్నాలజీస్, శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీ, ద్రవీడయన్ యూనివర్సిటీ, ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్, శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ, తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.