గుజరాత్ సీఎం మోడీకి ఆమెరికా ఆహ్వానం

అహ్మదాబాద్: గుజరాత్ సీఎం నరేంద్రమోడీకి ఆరుదైన గౌరవం దక్కింది. అమెరికా సందర్శించాల్సిందిగా అమెరికా బృందం మోడీని ఆహ్వానించింది. అమెరికా బృందం ఆహ్వానాన్ని మోడీ మన్నించారు. అమెరికా వెళ్లడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. జూన్‌లో మోడీ అమెరికా వెళ్లే అవకాశం ఉంది. కాగా, మోడీ పాలనపై అమెరికా బృందం ప్రశంసల జల్లు కురిపించింది. గుజరాత్‌లో ఆయన ప్రభుత్వం సాధించిన ప్రగతిని శ్లాఘించింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.