గుజరాత్ ప్రభుత్వానికి ఐబీ హెచ్చరిక

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని గుజరాత్ ప్రభుత్వాన్ని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు గుజరాత్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్ర జరుపుతున్నట్టు అనుమానాలున్నాయని తెలిపింది. యాసిన్ భక్తల్ గుజరాత్‌లో ప్రవేశించినట్టు అనుమానం వ్యక్తం చేసింది. ఈమేరకు గుజరాత్ భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేయాలని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర సర్కార్ భద్రతను కట్టుదిట్టం చేసింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.