గవర్నర్‌కు నిరసన సెగ

gaverner
– ప్రసంగంలో అసలు సమస్యలేవి?.. నిలదీసిన విపక్షాల సభ్యులు
– తెలంగాణ కోసం టీఆర్‌ఎస్.. ప్రజాసమస్యలపై ఇతర పక్షాలు
శాసనసభ సమావేశాలు ఎప్పటిలాగే నిరసనల మధ్య ప్రారంభమయ్యాయిపజాసమస్యలపై స్పందించాలని విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నా గవర్నర్ పట్టించుకోకుండాప్రసంగం పాఠం కాపీని చదివి వెళ్లిపోయారు. ఆయన ప్రసంగించేటప్పుడు సభ్యులు వివిధ రూపాల్లో తమ నిరసనను వెలిబుచ్చారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, ప్రభుత్వ కార్యక్షికమాలు బాగున్నాయని చెబుతూ గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించడంతోనే విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఉదయం 9.28గంటలకు సభలోకి గవర్నర్ ప్రవేశించారు. జనగణమన గీతంలో జయహే అన్న చివరి పదం పూర్తి కాగానే.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేచి జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సమయంలోనే గవర్నర్ లేచి ప్రసంగపాఠాన్ని చదవడం మొదలు పెట్టారు. టీఆర్‌ఎస్ సభ్యులు నిలబడి ఆందోళన చేస్తుండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు కదిలారు. కరెంటు, మహిళల భద్రత, నిత్యావసర వస్తువుల ధరలపై ప్లకార్డులు పట్టుకుని పోడియం వైపు బయలుదేరారు. అప్పటికే పోడియం చుట్టూ మోహరించి ఉన్న మార్షల్స్ టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ఇంతలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగ పాఠం కాపీలను చించి, పోడియంపైకి విసిరారు. అవి గవర్నర్ వద్దకు చేరకపోవడంతో ఎమ్మెల్యేలు కాగితాలను ఉండలుగా చుట్టి గవర్నర్ వైపు విసిరారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌డ్డి విసిరిన రెండు కాగితపు ఉండల్లో ఒకటి గవర్నర్ తలపైనుండి వెళ్లింది. మరకొటి గవర్నర్ ముఖం మీదుగా వెళ్లింది. అయినా గవర్నర్ మాత్రం ప్రసంగాన్ని ఆపలేదు. ఈ సమయంలోనే బీజేపీ, సీపీఐ, సీపీఎం సభ్యులు కూడా వారివారి స్థానాల్లోనే నిలబడి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అప్పటి వరకు మిన్నకుండిన వైఎస్సార్సీపీ సభ్యులు కూడా వారివారి స్థానాల్లోనే నిలబడి ప్రజా సమస్యలపై నినాదాలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది.

నాగం హల్‌చల్
సభలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నాగం జానార్దన్‌డ్డి హల్‌చల్ సృష్టించారు. పోడియం వైపు వచ్చిన నాగంను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో ఆయన వారితో వాదనకు దిగారు. తెలంగాణ ప్రాంతంలో వెయ్యిమంది ప్రాణాలు ఆర్పిస్తే ప్రసంగంలో కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని మండిపడ్డారు. నాగంకు తోడు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా పోడియం వైపుకు బయలుదేరడంతో మళ్లీ మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకోవడంతో మొత్తం అందరు సభ్యులు కాగితం రాకెట్లు తయారు చేసి గవర్నర్ మీదకు విసిరారు. తనకు అడ్డుగా ఉండే మార్షల్స్‌ను కూడా గవర్నర్‌కు అడ్డుగా స్పీకర్ నిలిపారు. రాకెట్లు గవర్నర్ వద్దకు వెళ్లకపోవడంతో మిగిలిన పార్టీల నాయకులు కూడా పోడియంకు దగ్గర ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కాగితం ఉండలు చుట్టి ఇవ్వడం గమనార్హం. తామెక్కడ వెనుకబడిపోతామోనని టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ పోడియంవద్దకు తోసుకుని వెళ్లడానికి యత్నించారు. మార్షల్స్ అడ్డుకోవడంతో నిలబడ్డ చోటే కొద్దిసేపు నిరసన తెలిపి వాకౌట్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సభలోనే కూర్చుండిపోయారు. ఇంతలో సీపీఐ ఎమ్మెల్యే గుండామల్లేశ్ బెంచీ పైకి ఎక్కినిరసన తెలిపారు. కొద్దిసేపటి తరువాత సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నిరసన తెలిపి సభ నుండి వాకౌట్ చేశారు. ఆ తరువాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా బెంచీలు ఎక్కి నిరసన తెలిపారు. అయినా స్పీకర్‌గానీ, గవర్నర్‌గానీ ఈ నిరసనను పట్టించుకోలేదు. సరిగ్గా 9.56నిమిషాలకు గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. సభలో మిగిలి ఉన్న సభ్యులకు నమస్కారం పెట్టి సభ నుండి నిష్క్ర

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.