గళమెత్తిన మరో కానిస్టేబుల్

సీమాంధ్ర పాలనలో విసిగివేసారిపోయిన తెలంగాణ పోలీసులు ఒక్కొక్కరుగా తమ గుండెలో గూడుకట్టుకన్న తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నారు. సీమాంధ్ర అధికారుల వేధింపులు, పెత్తనాన్ని ధిక్కరిస్తూ..
ఆత్మగౌరవాన్ని నినాదాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. మొన్నటి ఎల్బీ స్టేడియంలోని ఏపీఎన్జీవోల సభలో కానిస్టేబుల్ శ్రీనివాస్ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులుపిక్కటిల్లేలా నినదించగా.. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మరో తెలంగాణ కానిస్టేబుల్ ఆత్మగౌరవాన్ని నినాదాన్ని వినిపించారు. మెదక్ జిల్లా వాసి అయిన కానిస్టేబుల్ సంజీవులు గురువారం అసెంబ్లీ ఆవరణలో ‘జై తెలంగాణ’ అంటూ నినదించడం సంచలనం రేపింది.

మధ్యాహ్నం 12.30 గంటలకు అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన సంజీవులు కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయం ఎదుట ‘జై తెలంగాణ’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటూ సీమాంధ్ర నేతలు కుటిల కుట్రలకు తెరతీస్తుండటాన్ని చూస్తూ తట్టుకోలేక ఆయన ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చి.. రాష్ట్రం ఏర్పాటవుతున్న తరుణంలో అడ్డుకునేందుకు దీక్షలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

దీంతో అసెంబ్లీ భద్రతా సిబ్బందితోపాటు సివిల్ పోలీసులు రంగంలోకి దిగి కానిస్టేబుల్ సంజీవులును అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి, సీఎల్పీలో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సంజీవులు వద్దకు వెళ్లారు. కానిస్టేబుల్‌ను అరెస్టు చేయవద్దని, ఆయనపై ఎలాంటి కేసులు పెట్టవద్దని గండ్ర హెచ్చరించారు. కేసులతో ఇబ్బందులు కలిగిస్తే టీ కాంగ్రెస్ నేతలందరూ అండగా ఉంటారని పోలీసు, అసెంబ్లీ భద్రతా సిబ్బందికి సూచించారు. రెండు ప్రాంతాలను సమానంగా చూడాల్సిన ముఖ్యమంత్రే సమైక్యాంధ్ర అంటుండగా.. తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఒక కానిస్టేబుల్ ‘జై తెలంగాణ’ అంటే తప్పేంటని గండ్ర వెంకటరమణాడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు. పోలీసులు అదుపులో ఉన్న సంజీవులును విడిపించి ఇంటికి పంపారు. సంజీవులు గతంలో మెదక్ జిల్లాలో సివిల్ కానిస్టేబుల్‌గా పనిచేయగా.. మూడేళ్ల క్రితం జీఆర్‌పీ (రైల్వే) కానిస్టేబుల్‌గా సికింవూదబాద్‌కు బదిలీ చేశారని తెలిసింది.

సీమాంవూధుల పాలనలో పోలీస్ ఉద్యోగం చేయను..
మెదక్ జిల్లా కంగ్టి మండలం బార్లీ గ్రామానికి చెందిన సంజీవులు ఐదేళ్లక్షికితం మెదక్‌లో సివిల్ పోలీస్‌గా ఉద్యోగంలో చేరారు. సంజీవులు డిప్యూ మీద సికింవూదాబాద్ రైల్వే(జీఆర్‌పీ)లో ఆర్‌పీసీ 259గా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ డీజీపీ దినేష్‌డ్డి సీఎం కిరణ్‌పై చేసిన ఆరోపణలు.. తెలంగాణను అడ్డుకునేందుకు సీఎం చేస్తున్న కుట్రలు, దీక్షల పేరిట చంద్రబాబు, జగన్ చేస్తున్న కుట్రలతో తెలంగాణలో బలిదానాలు కొనసాగుతున్నాయని, ఈ పరిణామాల నేపథ్యంలో సీమాంవూధుల పాలనలో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేయవద్దని నిర్ణయించుకున్నానని సంజీవులు  తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.