గల్లంతైన మలేషియా విమానం హైజాక్ ?

మలేషియా: గత వారం రోజులుగా కనిపించకుండా గల్లంతైన మలేషియా విమానం హైజాక్‌కు గురైనట్లు మలేషియా ప్రభుత్వానికి ఎయిర్‌లైన్స్ దర్యాప్తు సంస్థ నివేదిక అందజేసింది. విమానం అదశ్యంపై అధికారుల విచారణ పూరైంది. హైజాక్‌కు కారణాలు తెలియడంలేదని ఆ నివేదికలో పేర్కొంది. విమానం నడపడంలో అనుభవం ఉన్న ఒకరిద్దరు వ్యక్తులు కలిసి విమానాన్ని హైజాక్ చేసినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తంచేసింది. ప్రయాణికుల్లోనే హైజాకర్లు ఉన్నట్లు అనుమానం. విమానంలోని రెండు విధాలుగా పనిచేసే సమాచార వ్యవస్థ సిగ్నళ్లను హైజాకర్లు నిలిపివేసినట్లుగా సమాచారం. విమానం నడపడంలో ఎంతో అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పేర్కొంది. సాధారణ రాడార్ వ్యవస్థకు సిగ్నల్స్ అందడం ఆగిపోయిన అనంతరం సైనిక రాడార్‌కు కొంత సమయం వరకు సిగ్నల్స్ అందాయని ఓ అధికారి తెలిపారు. విమానంలో మొత్తం 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.