గల్లంతైంది ఫైళ్లుకాదు, ప్రభుత్వం: మోడీ

బెంగళూరు: బొగ్గు కుంభకోణం విషయంలో బీజేపీ ప్రచార రథసారథి యూపీఏ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… బొగ్గు కుంభకోణం కేసులో ఫైళ్లు గల్లంతైనాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిందిగానీ, గల్లంతైంది ఫైళ్లుకాదు, ప్రభుతమేనని అన్నారు. ఐటీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ఘనత వాజ్‌పేయ్‌దేనని, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ సమస్యలు ఎదుర్కొంటుందని విమర్శించారు. అభివృద్ధిలో బెంగళూరు నగరం ఎప్పుడూ ముందుంటుందని కితాబిచ్చారు. భారతరత్నకు ఎంపికైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సీఎస్.రావులకు మోడీ అభినందనలు తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.