గర్భిణీల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది -కొత్త పథకం ప్రకటించిన కేంద్రమంత్రి ఆజాద్

గర్భిణీల సంక్షేమం కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రసవానికి ఆరునెలల ముందు నుంచే గర్భిణీ మహిళ చికిత్స, వైద్య పరీక్షలు, ప్రయాణం, ఆహార ఖర్చులను ప్రభుత్వమే భరించే విధంగా కొత్త పథకాన్ని రూపొందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆజాద్ శనివారం శ్రీనగర్‌లో ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపవూతిలో ప్రసవించడానికి ఆరునెలల ముందు గర్భిణీకి అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పిన ఆజాద్, పుట్టినబిడ్డ ఏడాదిలోపు ఏదైనా వ్యాధి బారిన పడితే అందుకు సంబంధించిన చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చులను కూడావూపభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.