గడువులోగా తెలంగాణ ఇవ్వకుంటే హైదరాబాద్ దిగ్బంధం-కవిత

కేంద్రం గడువులోగా తెలంగాణ ఇవ్వకుంటే హైదరాబాద్ ను దిగ్బంధిస్తమని తెలంగాణ  జాగృతి అధ్యక్షురాలు కవిత అల్టిమేటం జారిచేసిన్రు. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు కోరుతూ శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర జరిగిన మహాధర్నా గ్రాండ్ సక్సెస్ అయింది. ‘28లోగా తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే యువకులే స్వచ్ఛందంగా ముందుకు రావాలని కవత చెప్పిన్రు. తెలంగాణ కోసం కొట్లాడి మీరే హీరోలు కావాలి’ అని ఆమె పిలుపునిచ్చారు. ఎవరో నాయకత్వం వహిస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. స్వచ్ఛందంగా పోరాడి తెలంగాణ సాధించుకోవాలని ఆమె యువకులను కోరారు.
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి, తెలంగాణ ప్రజలను పట్టించుకోని మంత్రులకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు రాజకీయ సమాధికట్టాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈనెల 28 తర్వాత తెలంగాణ ఏర్పాటు కాకపోతే తెలంగాణ ప్రాంత మంత్రులందరూ రాజీనామాలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ మంత్రులను తెలంగాణలో తిరగనిచ్చేదిలేదని తేల్చి చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.