ఖాకీవనాన్ని ఛేదించి.

. ASHOK-NAGER-X-ROAD'S02 – ‘చలో అసెంబ్లీ’కి కదిలిన పోరుబిడ్డలు
– తెలంగాణ అంతటా పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు
– హైదరాబాద్‌లో సెక్షన్ 144 విధించిన పోలీసులు
– రహదారులు దిగ్బంధం.. అడుగడుగునా తనిఖీలు
– అసెంబ్లీ ఎదుట ఎనిమిది అడుగుల ఎత్తులో బారికేడ్
– అయినా వెనక్కితగ్గని ఉద్యమకారులు

యావత్ తెలంగాణ ఒక్కటైంది! ఖాకీ బలంతో ‘చలో అసెంబ్లీ’ని అణచివేయాలనుకున్న ప్రభుత్వంతో కలబడింది. అడుగడుగునా పోలీసులు మోహరించినా.. బారికేడ్లు.. ఇనుప ముళ్లకంచెలతు దారులను దిగ్బంధించినా పోరుబిడ్డలు వెనక్కితగ్గలేదు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటిచెప్పారు. సత్తా చాటారు. అడ్డంకులను అధిగమించి.. ఖాకీవనాన్ని ఛేదించి అసెంబ్లీ దగ్గరకు దూసుకువచ్చారు. తెలంగాణ బిడ్డల పౌరుషానికి సీమాంధ్ర పాలకులు.. పోలీసు ఉన్నతాధికారులు బిత్తర పోవాల్సి వచ్చింది. టీజేఏసీ పిలుపు మేరకు శుక్రవారం చలో అసెంబ్లీకి తెలంగాణ ప్రజలు కదలివచ్చారు. అనుమతిని నిరాకరించిన సర్కారు… ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసు యంత్రాంగాన్ని తెలంగాణ అంతటా నింపింది. అన్ని జిల్లాల్లో పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 30ని అమల్లోకి తీసుకువచ్చారు.

దీని ప్రకారం ఎలాంటి ఊరేగింపులు, ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించటానికి వీల్లేదని, దీనిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ‘చలో అసెంబ్లీకి అనుమతి లేదు.. హైదరాబాద్‌కు ఎవ్వరూ వెళ్లద్దు’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు…ఉద్యమకారులను వందల సంఖ్యలో ముందస్తు అరెస్టులు చేసింది. బైండోవర్లు చేయించింది. జిల్లాల నుంచి బయటకు వచ్చే ప్రతీ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సులను సైతం వదలకుండా ప్రతీ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.

ASHOK-NAGER-X-ROAD'S01హైదరాబాద్‌లోనైతే…
చలో అసెంబ్లీ నేపథ్యంలో హైదరాబాద్‌ను ప్రభు త్వం ఖాకీవనంగా మార్చివేసింది. కేంద్రం నుంచి రప్పించిన పారా మిలటరీ బలగాలతో కలిపి మొత్తంగా దాదాపు ముప్పయి వేలమంది పోలీసులను భాగ్యనగరంలో ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఒక్క అసెంబ్లీ పరిసరాల్లోనే అయిదువేల మందికి పైగా బలగాలను మోహరించింది. రవీంవూదభారతిని మూసివేయించింది. నిజాం కాలేజీ హాస్టల్‌ను ఖాళీ చేయించింది. పబ్లిక్‌గ్డాన్, తెలుగువర్సిటీని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అసెంబ్లీ చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ముగ్గురికన్నా ఎక్కువ సంఖ్యలో జనం గుమిగూడవద్దని, సభలు, సమావేశాలు, ఊరేగింపులు జరపటానికి వీల్లేదని, దీనిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.

జిల్లాల నుంచి హైదరాబాద్ లోపలికి వచ్చే అన్ని రహదారులపై పదిహేడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి ‘చలో అసెంబ్లీ’ కోసం వస్తున్నట్టుగా భావించిన వారిని దౌర్జన్యంగా వెనక్కి పంపించి వేశారు. బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో సైతం తనిఖీలు చేపట్టారు. అయినా, ఉద్యమకారులు అసెంబ్లీ వద్దకు దూసుకురావచ్చని భయపడ్డ పోలీసు ఉన్నతాధికారులు… ఇంతకుముందు ఎన్నడూ లేనిరీతిలో చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ వైపు దారి తీసే అన్ని రోడ్లను బారికేడ్లు, ఇనుప ముళ్లకంచెలతో మూసివేశారు. అసెంబ్లీ ఎదురుగా ఇప్పటికే ఉన్న బారికేడ్‌కు అదనంగా దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తుతో మరో బారికేడ్‌ను నిర్మించారు. దీనికి ఇనుప ముళ్లకంచెను చుట్టించారు. ఇన్ని అడ్డంకులను.. ఇంత నిర్బంధాన్ని దాటుకుని ఎవ్వరూ అసెంబ్లీ వరకు చేరుకోలేరన్న ధీమాను పోలీసులు కనబరిచారు. అయితే, నిర్బంధాన్ని ముందుగానే ఊహించి దాదాపు రెండు లక్షల మంది ఉద్యమకారులు రెండు మూడు రోజుల ముందే హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం ‘జై తెలంగాణ’ అంటూ అసెంబ్లీ పరిసరాలను మార్మోగించి సత్తా చాటారు.

ASHOK-NAGER-X-ROAD'sపోలీసుల ఓవర్‌యాక్షన్
హైదరాబాద్: భయం.. అతి జాగ్రత్తలు తీసుకునేలా చేస్తుందట! శుక్రవారం హైదరాబాద్‌లో సరిగ్గా ఇదే పరిస్థితి కనిపించింది. ఉద్యమకారులు ఎక్కడ అసెంబ్లీ వరకు దూసుకొస్తారోనని భయపడ్డ పోలీసులు ఓవర్‌యాక్షన్‌కు దిగారు. ఖాకీల అతి ప్రవర్తనకు అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీకి అయిదు కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రతి రహదారిని మూసివేయటంతో కార్యాలయాలకు.. గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలో అర్థంకాక గంటల తరబడి సందులు, గొందుల్లో పడి తిరగాల్సి పరిస్థితి వాహనదారులకు ఎదురైంది. ‘చలో అసెంబ్లీ’కి అనుమతి ఇవ్వలేమని స్వయంగా సీఎం కిరణ్‌కుమార్‌డ్డి చెప్పటంతో ఎలాగైనా సరే కార్యక్షికమాన్ని అడ్డుకుని శభాష్ అనిపించుకోవాలని నిర్ణయించుకున్న పోలీస్‌బాస్‌లు.. అత్యుత్సాహం ప్రదర్శించారు.

అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల వ్యాసార్థంలో నిషేధాజ్ఞలు విధించటంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకువచ్చారు. వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరింపచేశారు. ఇంత చేసినా ఉద్యమకారులు అసెంబ్లీ వరకు దూసుకొస్తారన్న భయమో.. ఏమో.. ఇంతకు ముందు ఎన్నడూలేని విధంగా దాదాపు సగం హైదరాబాద్‌ను పోలీసులతో దిగ్బంధించారు. ప్రధానంగా అసెంబ్లీకి దారితీసే అన్ని రహదారులు.. బైలేన్లను గురువారం రాత్రి 11గంటల నుంచే బారికేడ్లు.. ఇనుప ముళ్లకంచెలతో మూసివేయించారు.

సచివాలయం, విశ్వేశ్వరయ్య, బషీర్‌బాగ్, నారాయణగూడ, మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్లపై రాకపోకలను నిషేధించారు. పలు రూట్లలో బస్సులను రద్దు చేశారు. ఆటోలను సైతం తిరగనివ్వలేదు. శుక్రవారం ఉదయం 10గంటలకల్లా విధులకు హాజరుకావాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయని ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉద్యోగులు రోజుకన్నా అరగంట ముందే శుక్రవారం ఇళ్ల నుంచి బయల్దేరారు. అయితే… రాంకోఠి, ఆబిడ్స్, మొజంజాహీ మార్కెట్, సైఫాబాద్, తెలుగుతల్లి విగ్రహం ఇలా అన్ని రహదారులను పోలీసులు మూసివేసేయటంతో ఎలా ఆఫీస్‌లకు చేరుకోవాలో అర్థంగాక ఉద్యోగులు ఇబ్బందుల పాలయ్యారు. తాము ప్రభుత్వ ఉద్యోగులమని, విధులకు హాజరుకావటానికి వెళుతున్నామని గుర్తింపుకార్డులు చూపించినా ఖాకీలు వదలలేదు.
మరీ దారుణం..: ఇక, అత్యవసరంగా వైద్యసేవలు అవసరమైనవారు కూడా పోలీసుల తీరు వల్ల ఇక్కట్ల పాలయ్యారు. ప్రధాన ఆస్పవూతులు ఉన్న పరిసరాలను కూడా వారు దిగ్బంధించారు. దీంతో ఆస్పవూతులకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘అర్జంట్‌గా హాస్పిటల్‌కు వెళ్లాలి.. బారికేడ్లు పక్కకు జరిపి దారి ఇవ్వండి’ అంటూ పోలీసులను కోరినా పట్టించుకోలేదు.

This entry was posted in ARTICLES.

Comments are closed.