కోర్ తర్వాతే సీడబ్ల్యూసీ

-పంచాయతీ ఎన్నికల అనంతరం..
-స్థానిక పోరు నేపథ్యంలో గేమ్ ఆడుతున్న కాంగ్రెస్ అధిష్ఠానం
-తెలంగాణపై అఖిలపక్షం ఉత్తమాటే
-ఆర్టీఐ చట్టం సవరణలపైనే అఖిలపక్షం
-తేల్చి చెప్పిన కోర్‌కమిటీ ముఖ్య సభ్యుడు
-టీ సంప్రదింపులు ముగిశాయన్న డిగ్గీరాజా
-త్వరలోనే యూపీఏ నిర్ణయమని వెల్లడి
తెలంగాణ ఏర్పాటు విషయంలో కీలక తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముందుగా ప్రచారం జరిగినట్లుగా ఈ నెల 28న ఉండబోవటం లేదు. రాష్ట్రంలో కొద్ది రోజుల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల అనంతరం.. అంటే జూలై 31 నుంచి ఆగస్టు 5లోపు ఉండే అవకాశం కనిపిస్తున్నది. ఈ సమావేశం తేదీని వచ్చే శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్‌కమిటీ భేటీలో నిర్ణయించనున్నారు.

శుక్రవారం ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్‌కమిటీ వారాంతపు సమావేశం జరిగింది. ప్రధానితోపాటు.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారుడు అహ్మద్‌ప కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్‌షిండేతోపాటు.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కోర్‌కమిటీ ముఖ్యనేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుందని, అది ఎప్పుడు జరిగేదీ తదుపరి కోర్‌కమిటీ భేటీలో నిర్ణయమవుతుందని తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వెంటనే ప్రకటన చేయాల్సి ఉంటుంది. 28న సీడబ్ల్యూసీ జరిగే పక్షంలో దాని నిర్ణయం ప్రభావం జూలై 31 వరకూ జరిగే ఎన్నికలపై పడే అవకాశం ఉంది. దీంతో పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆగస్టు ఐదు లోపు సీడబ్ల్యూసీని సమావేశపర్చాలన్న యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని బట్టి తెలంగాణపై కార్యాచరణ ఉంటుందని ముఖ్యనేత చెప్పారు. ఇదే అంశంపై కోర్‌కమిటీలో చర్చ జరిగిందని సమాచారం. అగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విధి విధానాలు, అనుసరించాల్సిన ఎత్తుగడలపై కోర్‌కమిటీలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

అందులో భాగంగానే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమలనాథ్‌ను కోర్‌కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానించారని సమాచారం. ఇదిలా ఉండగా.. తెలంగాణపై మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ పీటీఐ వార్తా సంస్థలో ఒక కథనం వచ్చింది. అఖిలపక్షం ఏర్పాటు చేసిన తర్వాతే సీడబ్ల్యూసీ సమావేశం ఉండే అవకాశాలున్నట్లు పీటీఐ తన కథనంలో తెలిపింది. కానీ.. అలాంటిదేమీ లేదని మీడియాతో మాట్లాడిన కోర్‌కమిటీ సభ్యుడొకరు స్పష్టం చేశారు. తెలంగాణపై మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. సమాచార హక్కు చట్టంలో కొన్ని సవరణలు చేసేందుకే అఖిలపక్షం ఏర్పాటు చేయనున్నట్లు వివరణ ఇచ్చారు. మరోవైపు మహారాష్ట్ర పర్యటనలో ఉన్న దిగ్విజయ్‌సింగ్ కూడా సంప్రదింపుల ప్రక్రియ ముగిసిపోయిందని ముంబై, పుణెల్లో విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వం త్వరలోనే తెలంగాణ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశార

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.