కోదండరాం, ఈటెల, జూపల్లి, శ్రీనివాస్ గౌడ్ కు ఏప్రిల్ 4 వరకు రిమాండ్-నిరసనలకు టీఆర్ఎస్ పిలుపు

మహబూబ్‌నగర్ : తెలంగాణ ఉద్యమం పట్ల సీమాంధ్ర సర్కార్ విషం కక్కుతోంది. తెలంగాణ ఉద్యమకారులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తోంది. సీమాంధ్ర సర్కార్ ఆదేశాలను తు.చ తప్పకుండా పోలీసులు అమలు చేస్తున్నారు. సడక్ బంద్ సందర్భంగా అరెస్టు అయిన కోదండరాం, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ముగ్గురిని అలంపూర్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. వీరికి కోర్టు ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించింది. ఈ రాత్రికి వీరు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. అనంతరం ఈ ఏడుగురికి బెయిల్ కోసం టీ న్యాయవాదులు అలంపూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

రేపు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన కేసీఆర్:

తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేయడం ప్రభుత్వ అహంకారమేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు  చంద్రశేఖరరావు అన్నారు. కోదండరాం, ఈటెల రాజేందర్, శ్రీనీవాస్‌గౌడ్, జూపల్లి కృష్ణారావు, జితేందర్‌రెడ్డి తదితరుల రిమాండ్‌ను కేసీఆర్ ఖండించారు.  శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఆయన తెలంగాణవాదులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.