కోదండరాంపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లు
Posted on March 21, 2013
మహబూబ్‌నగర్: సీమాంధ్ర సర్కారు ఉద్యమం అణిచివేతకు కొత్త కుట్రలకు తెరలేపింది. నిన్నమొన్నటి వరకు విద్యార్థులను, జేఏసీ నాయకులను, టీఆర్ఎస్ కార్యకర్తలను కేసుల్లో ఇరికించిన ప్రభుత్వం ఈ రోజు ఉదయం అరెస్టు చేసిన జేఏసీ చైర్మన్ కోదండరాం, ఉద్యోగాసంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్‌లపై 147, 148 నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. కేసులకు, జైళ్లకు తెలంగాణ ఉద్యమకారులు భయడరని కోదండరాం తెలిపారు. త్వరలో విజయవాడ జాతీయ రహదారిలోనూ సడక్‌బంద్ నిర్వహిస్తామని తెలిపారు. అసెంబ్లీ సెషన్ నడిచే సమయంలోనే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉటుందని ఆయన తెలిపారు. అసెంబ్లీ ముట్టడి తర్వాత ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకే ముఖ్యమంత్రి సడక్‌బంద్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. ప్రజలు స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి సడక్‌బంద్‌ను విజయవంతం చేశారని పోరాటస్పూర్తి చూపిన తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
This entry was posted in
TELANGANA NEWS.
good news we can read up to date information in this site
govt is now attacking to telengana jac leaders by imposing sec 147,148 to stop the telengana egitation but telengana struggle never stop