కొలువుల జాతర

– 33,738 ఉద్యోగాల భర్తీ
– రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు
– ఏపీపీఎస్సీ ద్వారా 11,250 పోస్టులు
– పోలీసు శాఖ, రవాణా శాఖలలో 11,623 పోస్టులు..
-10,865 పోస్టులకు శాఖాపరమైన పదోన్నతులు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరతీసింది. ఒకేసారి వివిధ హోదాల్లో రికార్డు స్థాయిలో 33,738 ఉద్యోగాలను భర్తీచేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 11,250 పోస్టులను ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తారు. పోలీసు శాఖ, రవాణా శాఖల పరిధిలో 11,623 పోస్టులను రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. మిగతా 10,865 పోస్టులను శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీ-డీపీసీ)ల ద్వారా భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఏపీపీఎస్‌సీ భర్తీ చేసే పోస్టులు
మార్కెటింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్-8 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్-8 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-29 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్-9 పోస్టులు, జూనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్-27 పోస్టులు, సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ -13 పోస్టులు, సీనియర్ స్టెనోక్షిగాఫర్- ఒక పోస్టు ఉన్నాయి. వ్యవసాయశాఖలో జూనియర్ అసిస్టెంట్-42 పోస్టులు, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు-137 పోస్టులున్నాయి. మత్య్సశాఖ పరిధిలో అసిస్టెంట్ ఇన్‌స్సెక్టర్ ఆఫ్ ఫిషరీస్-3 పోస్టులు, సీనియర్ స్టెనోక్షిగాఫర్- ఒకపోస్టు ఉంది. పశుసంవర్ధక శాఖలో జూనియర్ అసిస్టెంట్-12 పోస్టులు, జూనియర్ స్టెనోక్షిగాఫర్- ఒక పోస్టు, సీనియర్ స్టెనోక్షిగాఫర్-2 పోస్టులున్నాయి.

బీసీ సంక్షేమ శాఖలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్-55 పోస్టులు, ఛీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సీఆర్వో) పరిధిలో సీనియర్ స్టెనోక్షిగాఫర్- ఒక పోస్టు, పౌరసరఫరాల శాఖలో సీనియర్ స్టెనోక్షిగాఫర్-3 పోస్టులు, తూనికలు కొలతల శాఖలో ఇన్‌స్పెక్టర్-44 పోస్టులు, సీనియర్ స్టెనోక్షిగాఫర్- ఒక పోస్టు ఉన్నాయి. రాష్ట్ర కాలుష్య నియంవూతణ మండలి(ఏపీపీసీబీ)లో ఎనాలిస్ట్ గ్రేడ్-2లో -31 పోస్టులు, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్-27 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్-17 పోస్టులు, స్టెనో కమ్ టైపిస్టు-8 పోస్టులు, స్టోర్/పర్చేజ్ అసిస్టెంట్- ఒక పోస్టు ఉన్నాయి. అటవీ శాఖ పరిధిలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్-59 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్-40 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు-2 పోస్టులు, జూనియర్ స్టెనోక్షిగాఫర్-13 పోస్టులు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థలో అసిస్టెంట్ ఎస్టేట్ మేనేజర్-3 పోస్టులు, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్-29 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్-3 పోస్టులు, జూనియర్ స్టెనోక్షిగాఫర్-15 పోస్టులు, ప్రోగ్రామర్- ఒక పోస్టు, సీనియర్ అకౌంటెంట్-5 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్-3 పోస్టులు, సీనియర్ డ్రాఫ్ట్‌మెన్-1పోస్టు, సీనియర్ స్టెనోక్షిగాఫర్-4 పోస్టులున్నాయి. ఇంధన శాఖ పరిధిలోని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్‌లో జూనియర్ అసిస్టెంట్-4 పోస్టులు, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో అసిస్టెంట్-76 పోస్టులు, సాంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్-8 పోస్టులున్నాయి.

ఆర్థిక శాఖ పరిధిలో డైరెక్టర్ ఆఫ్ ఇన్సున్స్‌లో సీనియర్ అకౌంటెంట్-80 పోస్టులు, సీనియర్ ఆడిటర్-17 పోస్టులు, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్-20 పోస్టులు, జూనియర్ అకౌంటెంట్-114 పోస్టులు, సీనియర్ అకౌంటెంట్-273 పోస్టులున్నాయి. డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ శాఖలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ (వర్క్స్) గ్రేడ్ 2లో-103 పోస్టులు, ఆర్థిక శాఖ(ఓపీ)లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-22 పోస్టులు, సీనియర్ స్టెనోక్షిగాఫర్-3 పోస్టులున్నాయి. పే అండ్ అకౌంట్స్ ఆఫీసులో అసిస్టెంట్ ఆడిటర్-7 పోస్టులు, ఆడిటర్-6 పోస్టులున్నాయి. సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)పరిధిలోని రాష్ట్ర ట్రిబ్యునల్‌లో జూనియర్ అసిస్టెంట్-ఒక పోస్టు, సీనియర్ అసిస్టెంట్- ఒక పోస్టు, సమాచార పౌరసంబంధాల శాఖలో అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్-45 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్-21 పోస్టులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్-8 పోస్టులు, డిస్ట్రిక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్-5 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్-6 పోస్టులు, సీనియర్ స్టెనోక్షిగాఫర్-2 పోస్టులున్నాయి. ఎస్టేట్ ఆఫీసర్ కింద జూనియర్ అసిస్టెంట్-5 పోస్టులు, సాధారణ పరిపాలన(ఎస్‌యు)లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-73 పోస్టులు, జూనియర్ స్టెనోక్షిగాఫర్-6 పోస్టులు, సీనియర్ స్టెనోక్షిగాఫర్-25 పోస్టులున్నాయి. ఉన్నత విద్యాశాఖ పరిధిలో కాలేజియేట్ ఎడ్యుకేషన్‌లో జూనియర్ అసిస్టెంట్-8, లెక్చరర్లు-617, లైబ్రెరియన్-22, ఫిజికల్ డైరెక్టర్-22 పోస్టులున్నాయి.

ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్‌లో జూనియర్ లెక్చరర్-4,523, లైబ్రెరియన్-43, ఫిజికల్ డైరెక్టర్-325 పోస్టులున్నాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్-182, లెక్చరర్-180, లైబ్రెరియన్-56, ఫిజికల్ డైరెక్టర్-59, స్టెనో టైపిస్టు-24 పోస్టులున్నాయి. రాష్ట్ర పురావస్తు, పరిశోధన సంస్థలో 33, ఓరియంటల్ మాన్యువూస్కిప్ట్స్ లైబ్రరీ అండ్ రీసెర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో 4 పోస్టులున్నాయి. వైద్య విధాన పరిషత్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్-575 పోస్టులు, ఆయుష్‌లో 53 పోస్టులు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌లో 44 పోస్టులు, కుటుంబ సంక్షేమం శాఖలో 29, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 25, ఫైర్ అండ్ ఎమ్జన్సీ సర్వీసెస్‌లో 27, స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్‌లో 3 , జైళ్ళ శాఖలో 25, డీజీపీ ఆఫీసులో డీఎస్పీ-4 పోస్టులున్నాయి.

హౌసింగ్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్-25 పోస్టులు, పరిక్షిశమలు వాణిజ్య శాఖల పరిధిలో 78 పోస్టులు, సాగునీటి పారుదల శాఖలో 378 పోస్టులు, న్యాయశాఖలో 3 పోస్టులు, కార్మిక ఉపాధికల్పన శాఖలో 39 పోస్టులు, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలో 539 పోస్టులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో 394 పోస్టులు, ప్రణాళిక శాఖలో 95 పోస్టులు, రెవెన్యూ శాఖ సీసీఎల్‌ఏ-10 పోస్టులు, వాణిజ్య పన్నుల శాఖ-66 పోస్టులు, దేవాదాయశాఖ-189 పోస్టులు, ఎక్సైజ్ శాఖలో-364 పోస్టులు, సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో 174 పోస్టులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో 185 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 4 పోస్టులు, సాంఘిక సంక్షేమ శాఖలో 15 పోస్టులు, రవాణా శాఖలో 59 పోస్టులు, రోడ్లు భవనాల శాఖలో 135 పోస్టులున్నాయి. యువజన సర్వీసులు పర్యాటక శాఖలో 28 పోస్టులు ఉన్నాయి.

పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీచేసే పోస్టులు
ఫైర్ సర్వీసుల్లో 236 పోస్టులు, జైళ్ళ శాఖలో 299 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 182 పోస్టులు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)పరిధిలో-10,906 పోస్టులు ఉన్నాయి. కాగా, డిపార్ట్‌మెంటల్ సెలెక్షన్ కమిటీ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలలో భర్తీ చేసే పోస్టులు 10,865 ఉన్నాయి

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.