కొరివితో తలగోక్కుంటున్న సీఎం

kiran
నీవు ఎంత నాయకుడివి.. నీ స్థాయి ఎంత?.. ఉద్యమనేతపై సీఎం ఫైర్
జాతీయ నాయకత్వాన్ని విమర్శించే స్థాయి ఎక్కడిదని కేసీఆర్‌కు ప్రశ్న
కేసీఆర్ ఓ ఉప ప్రాంతీయపార్టీ నేత.. నెహ్రూ కుటుంబాన్ని విమర్శిస్తారా?
ఇదేనా నీ సంస్కృతి.. తెలుగువారు తలదించుకునేలా కేసీఆర్ భాష
ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఎవ్వరికీ లేదు.. ఎవరి దయ మీదా ఆధారపడి లేము
ప్రభుత్వాన్ని నడిపే బలం మాకుంది.. మళ్లీ అధికారంలోకి వస్తాం అంటూ సీఎం జనవరి 29న మాట్లాడిండు. టీఆర్ఎస్ ను రెచ్చగొట్టి కొరివితో తలగోక్కున్నడు.

‘ఓ ప్రదేశంలో ఒక ప్రాంతానికి నువ్వు నాయకుడివి. మీ పార్టీ ఎంత? మీరెంత? ఈ పదజాలం వాడటం ఎంత వరకు సమంజసం? కాంగ్రెస్ నాయకులే కాదు, ప్రజలు కూడా మీ భాషను, ప్రవర్తనను అసహ్యించుకునే పరిస్థితి కల్పించారు’ అన్నారు. పెద్ద నాయకులను దూషించి తాను పెద్ద నాయకుడవుతానని కేసీఆర్ భావిస్తే అది మూర్ఖత్వమే అవుతుందని చెప్పారు. మంగళవారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు సుదర్శన్‌డ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతాడ్డి, సబితా ఇంద్రాడ్డి, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌డ్డి, దానం నాగేందర్, ప్రసాద్‌కుమార్, సునీత లకా్ష్మడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణాడ్డి, విప్ ఈరావత్రి అనిల్ తదితరులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రపంచ దేశాల్లోనే పేరుగాంచిన భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. ఒక దేశానికి దశా దిశ చూపిన గొప్ప నాయకుడన్నారు. దేశ స్వాతంవూత్యంకోసం ఆస్తులను ధారాదత్తం చేయడమే కాకుండా దేశంకోసం ప్రాణాలర్పించిన కుటుంబమన్నారు. ‘బ్యాంకులను జాతీయం చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక ప్రణాళికలువంటి చరివూతాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత సాధించిన ఇందిరాగాంధీని, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొచ్చిన రాజీవ్‌గాంధీని, యూపీఏను రెండుసార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన సోనియాను, విజ్ఞానవంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఉద్దేశించి కేసీఆర్ వాడిన పదాలు, భాష చూసి తెలుగువారంతా సిగ్గుతో తలదించుకున్నారు’ అని సీఎం చెప్పా రు. ‘ఇదేనా నీ సంస్కృతి’ అని ప్రశ్నించారు.

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మన్మోహన్ సంస్కరణలవల్ల దేశం ఆర్థికంగా ఎంతో పటిష్ఠంగా ఉందన్నారు. అవినీతి మచ్చ అంటని ప్రధానిపైనా విమర్శలు చేస్తారా? అని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. ‘తెలంగాణ ఏపీ నుంచి విడిపోవాలా? కలిసి ఉండాలా? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకుల కోరిక మేరకు కేంద్రం ఈ అంశంపై పరిశీలన చేసే సమయంలో, జటిలమైన, సున్నితమైన సమస్యకు సమయం అడగడం నేరమా?’ అని సీఎం ప్రశ్నించారు.  ‘మీ సహాయంతో గెలిచిన వారు ఎవ్వరూ ఇక్కడ లేరు. తెలంగాణ ప్రాంతంలో మా నాయకులు స్వశక్తితో, కాంగ్రెస్ పార్టీ వల్ల గెలిచారు. మీ దయాదాక్షిణ్యాలపై గెలవలేదు అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి’ అని సీఎం చెప్పారు.   కేసీఆర్‌పై కేసు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారన్న ప్రశ్నకు ‘కేసుల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు. నిన్న జోక్యం చేసుకోలేదు. ఇంతకు ముందు చేసుకోదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని సమాధానమిచ్చారు.  ‘కేసీఆర్ స్థాయి ఎంత? జాతీయ నాయకులను దూషించే స్థాయి నీకు ఉందా?’ అని సీఎం ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.