కొనసాగిన అరెస్టుల పర్వం

-హైదరాబాద్‌లో 700.. సైబరాబాద్‌లో 476
-అరెస్టులపై పోలీసుల ప్రకటన
-అరెస్టయినవారిలో 45 మంది ఎమ్మెల్యేలు
-ముగ్గురు చొప్పున ఎంపీలు, ఎమ్మెల్సీలు..
మెరుపు మెరిసినట్లు.. దూసుకొచ్చిన ఆందోళనకారులు.. ఉరుము ఉరిమినట్లు.. పెల్లుబికిన నినాదాలు! ఉదయం నుంచి సాయంత్రం దాకా.. చలో అసెంబ్లీ ఉద్యమ రుతుపవనం రాజధానిలో రణన్నినాదాలు చేసింది. ఈదురు గాలులతో పోటీగా పోరుగాలి వీచింది. ఉద్యమకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా అరెస్టులకు పూనుకున్నారు. హైదరాబాద్ నగరంలో 700 మందిని, సైబరాబాద్ పరిధిలో 476 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఇందులో 45మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అరెస్టుల పర్వం.. వివరాలు ఇలా ఉన్నాయి.

ఉదయం
7.45 : సికింవూదాబాద్ జేబీఎస్ వద్ద ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే రామలింగాడ్డి అరెస్టు.
8.30 : గన్‌పార్క్ వద్ద 30మంది టీఆర్‌ఎస్వీ విద్యార్థుల అరెస్టు.
10.40 : డాట్స్ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అరెస్టు.
10.50 : గ్రేటర్ టీఆర్‌ఎస్ కార్యదర్శి టీ జీవన్‌సింగ్ అరెస్టు.
11.00 : ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్టు.
11:00 : సీపీఐ కార్యకర్తల అరెస్టు.
11:05 : టీఆర్‌ఎస్వీ ఓయూ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి ఆవాల హరిబాబు అరెస్టు.
11.30 : లిబర్టీ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల అరెస్టు.
11.35 : అసెంబ్లీ గేట్-1, 2 వద్ద ఆందోళనకు దిగిన టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కేటీఆర్, యెండల లక్ష్మీనారాయణ, కూనంనేని సాంబశివరావు అరెస్టు.

మధ్యాహ్నం
12.06 : నార్సింగ్ ఠాణా ఎక్కిన బీజేపీ నాయకుల అరెస్టు.
12.15 : ఇందిరాపార్కు వద్ద అరుణోదయ సాంస్కృతి సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అరెస్టు.
12.15 : అశోక్‌నగర్ వద్ద తెలంగాణ టీజేఎఫ్ నేత మల్లేపల్లి లక్ష్మయ్య అరెస్టు.
12.20 : గంటలకు గోషామహల్ వద్ద మంగళ్‌హాట్ కార్పొరేటర్ రాజాసింగ్ అరెస్టు.
12.30 : అశోక్‌నగర్ చౌరస్తాలో బీజేపీ నేతలు విద్యాసాగర్‌రావు, నల్లు ఇంద్రసేనాడ్డి అరెస్టు.
12.40 : ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ కిషన్‌డ్డి, బండారు దత్తావూతేయ, రామస్వామి అరెస్టు.
12.45 : తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవివూపసాద్ అరెస్టు.
1.00 : అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఇందిరాపార్కువైపు వెళ్తున్న టీ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఉద్యోగనేత శ్రీనివాస్‌గౌడ్ అరెస్టు.
1.15 : అశోక్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు మధుసూదనాచారి అరెస్టు.
1.30 : ఇందిరాపార్కువద్ద టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్ అరెస్టుకు యత్నం. సొమ్మసిల్లిన శ్రవణ్.
2.00 : నిజాం క్లబ్‌వద్ద ఎంపీలు మందా జగన్నాథం, వివేక్, తెరాస నేతలు వినోద్, జితేందర్ రెడ్డి అరెస్టు.
2.30 : గన్‌పార్క్ వద్ద మెదక్ ఎంపీ విజయశాంతి అరెస్టు.
2.35 : గన్‌పార్క్ వద్ద తెలంగాణ బ్రాహ్మణ సంఘం నాయకుల అరెస్టు.
3.00 : తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గంధం అంజన్న, ప్రధాన కార్యదర్శి కుర్మయ్యల అరెస్టు.
3.30 : టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ, నేతుల పల్లె రవికుమార్, కట్టా శేఖర్‌డ్డి, మార్కండేయ అరెస్టు.
3.35 : అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణవాది రహమున్నీసా అరెస్టు.

సాయంత్రం
4.00 : అసెంబ్లీ ప్రాంగణంలో 70మంది అడ్వకేట్ జేఏసీ నాయకుల అరెస్టు.

This entry was posted in ARTICLES.

Comments are closed.