కొత్త డీజీపీకి స్వాగతం

సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ దినేష్ రెడ్డి పదవీకాలం ముగిసింది. డీజీపీగా తప్పుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ఇవాళ విధుల నుంచి తప్పుకున్నరు. ప్రస్తుతం ఇన్‌చార్జి డీజీపీగా ఐపీఎస్ అధికారి ప్రసాదరావు సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కొత్త డీజీపీకి స్వాగతం పలుకుతున్నం. దళిత కులం నుంచి వచ్చిన డీజీపీ ప్రసాదరావు గారు పీడిత ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుంటరని ఆశిస్తున్నం.. సీమాంధ్రలో విభజనకు మద్దతుగా ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ..  ప్రత్యేకాంధ్ర కోసం పోరాడుతున్న దళిత బహుజనులపై పోలీసుల దౌర్జన్యకాండను ఆపిస్తరని ఆశిస్తున్నం.. సీమాంధ్రలో జరుగుతున్న స్పాన్సర్డ్ ఉద్యమకారులు సమైక్యాంధ్ర పేరుతో బడుగు బలహీనవర్గాలపై జరుపుతున్న దాడులపై చర్యలు తీసుకుంటరని కోరుతున్నం.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.