కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్: ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. 2013-14 సంవత్సరానికిగాను కొత్త అబ్కారీ విధానాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పాలసీ జులై 1 నుంచి అమలులోకి వస్తోందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.22 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా కొత్త ఎక్సైజ్ పాలసీని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 6,596 మద్యం దుకాణాలు కేటాయించింది. మద్యం దుకాణాల సంఖ్యను ప్రభుత్వం పెంచలేదు. గతేడాది ఉన్న పాలసీలో ఐదు మార్పులు చేసింది.

లైసెన్సు ఫీజుల వివరాలు:
– జనాభా ప్రాతిపదికన ఆరు స్లాబ్‌లుగా లైసెన్సు ఫీజులను నిర్ణయించింది.
– 10 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్సు ఫీజు రూ.25 లక్షలు
– 10-50 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్సు ఫీజు రూ.34 లక్షలు
– 50-3 లక్షల జనాబా ఉన్న ప్రాంతాలకు లైసెన్సు ఫీజు రూ.42 లక్షలు
– 3-5 లక్షల జనాబా ఉన్న ప్రాంతాలకు లైసెన్సు ఫీజు రూ.46 లక్షలు
– 5-20 లక్షల జనాబా ఉన్న ప్రాంతాలకు లైసెన్సు ఫీజు రూ.64 లక్షలు
– 20 లక్షల పై చిలుకు జనాబా ఉన్న ప్రాంతాలకు లైసెన్సు ఫీజు రూ.1.4 కోట్లుగా నిర్ణయించింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.