కొండా దంపతులకు బీజేపీ గాలం!

గత కొద్ది రోజులగా వైసీపీతో అంటీ ముట్టనట్లుగా ఉన్న కొండా దంపతులపై బీజేపీ కన్ను పడింది. కొండా సురేఖ, కొండా మురళీలను భారతీయ జనతాపార్టీ చీఫ్ కిషన్‌రెడ్డి తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ వరంగల్ వేదికగా కిషన్‌రెడ్డి కొండా దంపతులతో సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. వైసీపీలో తాము కోరుకున్న ప్రాధాన్యత లభించకపోవడంతో కొండా దంపతులు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో బీజేపీ ఆహ్వానించడంతో వారు కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరితే ఇటు టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు తెలంగాణ వాదానికి పూర్తి లైసెన్సు పొందవచ్చని కొండా దంపతులు భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.