కేసీఆర్ హత్యకు కుట్ర జరుగుతోంది : టీఆర్‌ఎస్

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ రథసారథి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కొన్ని శక్తులు హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఉద్యమ పార్టీ బయటపెట్టింది. తమ పార్టీ అధినేతను హత్య చేసేందుకు కుట్రపన్నతున్నట్లు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, సుపారీ తీసుకు వ్యక్తులెవరో కూడా సమాచారముందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, ఈటెల రాజెందర్‌లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీకి ఫిర్యాదు చేశామని వారు పేర్కొన్నారు. కేసీఆర్ హత్య ప్లాన్‌కు సంబంధించిన ఆధారాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. ఉద్యమ పెద్దకు జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ కల్పించమని కోరనున్నట్లు వారు వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.