కేసీఆర్ ప్రసంగం సప్పగలేదు.. గొప్పగా ఉంది !!

(పోరుతెలంగాణ శ్రీనివాస్)

కొంగరకలాన్‌.. అభివృద్ధి కమాన్‌గా మారింది. ఇసుకేస్తే రాలని జనంతో గులాబీవర్ణంలో మెరిసింది. ఏ చానల్‌ వాళ్లు మైకుపెట్టినా లుంగికట్టుకున్న వాళ్ల నుంచి ప్యాంట్లు వేసుకున్నవారి వరకు ఎవరిని అడిగినా తెలంగాణ రాష్ట్ర పథకాలను.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని.. తాము పొందిన లబ్దిని  గుక్కతిప్పుకోకుండా చెప్పారు. మంత్రుల కన్నా గొప్పగా సామన్య ప్రజలే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల్లోకి ఇంతగా చొచ్చుకెళ్లిన పథకాలను సీఎం మళ్లీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రజలే ప్రభుత్వానికి ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చారు కాబట్టి సీఎం వాటిజోలికి వెళ్లలేదు.. ప్రతిపక్షాలపై ప్రజలకు కూడా ఒక అవగాహన ఉందని భావించిన సీఎం విపక్షాలను సైతం తిట్టకుండా వదిలేశారు. ఇది ఉద్యమ సమయం కాదు.. ప్రజలను చైతన్యపరచాల్సిన పనిలేదు. ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని సీఎం కేసీఆర్ కళ్లారా చూశారు.  సీఎం స్పీచ్‌ సప్పగా లేదు.. గొప్పగా ఉంది. సీఎం కేసీఆర్  సుత్తిలేకుండా సూటిగా మాట్లాడారు. కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడ్తామని చెప్పారు. మరిన్ని వరాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు.  మీడియాతో పాటు రాజకీయ పార్టీలన్నీ కేసీఆర్ ముందస్తు గురించి క్లారిటీ ఇస్తారని ఎదురుచూశాయి.. కానీ సీఎం కేసీఆర్ అలా చేయకపోవడంతో ప్రసంగం సప్పగా ఉంది. సప్పుడు లేదని విమర్శలు చేస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారన్న విషయం మరిచిపోయారు.   కొంగరకలాన్ సభ సక్సెస్‌ తో ప్రజలంతా టీఆర్ఎస్‌ ప్రభుత్వం వెంటే ఉన్నారన్న స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇక ఎన్నికలు డిసెంబరా..? మార్చా? అన్నది మాత్రమే క్లారిటీ రావాలి.

This entry was posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *