కేసీఆర్‌ను మించిన ప్రజాస్వామ్యవాదిలేడు: హరీష్

సీమాంధ్ర ప్రజల అనుమానాలను నివృత్తి చేయడానికి ఎక్కడికంటే అక్కడికి వస్తామని హరీష్‌రావు అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను మించిన ప్రజాస్వామ్యవాదిలేడని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ అనేక పదవులను వదులుకున్నాడని ఆయన గుర్తు చేశారు. పదమూడు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగానికి సిద్దపడ్డారని తెలిపారు. నిబద్దత గల కేసీఆర్‌పై మంత్రి దానం నాగేందర్ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.

హైదరాబాద్‌ను యూటీ చేయాలని కుట్ర పన్నుతున్నారు: హరీష్
కొందరు సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌ను యూనియన్ టెర్రిటరీగా చేయాలని కుట్ర పన్నుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని అడగడం ప్రేమించకపోతే యాసిడ్ పోస్తామని బెదిరించినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. అందరని కలుపుకుపోయే మనస్తత్వం హైదరాబాద్ ప్రజలదని ఆయన తెలిపారు.

ఎన్‌బీఏ గైడ్‌లైన్స్ ఏమైపోయాయి: హరీష్

రెండు రాష్ట్రాలు విడిపోయే సందర్భంలో సీమాంధ్ర డబ్బాలు పనిగట్టుకుని అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమం జరిగినపుడు పీసీఐ, ఎన్‌బీఏ గైడ్‌లైన్స్ పేరుతో ప్రసారాలను నిలిపివేశారని ఆయన అన్నారు. మరి అదే నిబంధనలను ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమం విషయంలో ఎందుకు అమలుచేయడంలేదని ఆయన ప్రశ్నించారు. మిలియన్ మార్చ్ సమయంలో విగ్రహాల ధ్వంసం సమయంలో బోరున విలపించిన సీమాంధ్ర నేతలు ఇపుడు సీమాంధ్రలో విగ్రహాల ధ్వంసంపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.