కేసీఆర్‌ను తిడుతుంటే గుండెమండుతుంది: కేకే

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సీమాంధ్రులు తిట్టడంపై ఆపార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మండిపడ్డారు. కేసీఆర్‌ను తిడుతుంటే తన గుండె మండుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును ఏ శక్తి ఆపలేదని ఆయన హెచ్చరించారు. మన ఉద్యమం వెనుక శాంతియుత పోరాట పటిమ ఉందని తెలిపారు. సీమాంధ్రలో కృతిమ ఉద్యమాన్ని కొండంత చేసి చూపొద్దని సీమాంధ్ర మీడియాను కోరారు. కృతిమ ఉద్యమాన్ని చూపించి ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించొద్దని స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.