‘కేసీఆర్‌కు ఫేస్‌బుక్‌లో అకౌంట్ లేదు’

 ఫేస్‌బుక్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపీలను, ఎమ్మెల్యేలను ప్రకటించారని కేసీఆర్ అకౌంట్ పేరిట పోస్టు చేసిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఫేస్‌బుక్‌లో వచ్చిన వార్తలపై టీఆర్‌ఎస్ స్పందించింది. కేసీఆర్‌కు ఫేస్‌బుక్‌లో ఎలాంటి అకౌంట్ లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. దీనిపై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతామని తెలిపింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.