10 రోజుల్లో ఆయన్ని చంపేస్తాం
– ఎల్ఈటీ ఆంధ్రా నక్సల్ పేరిట హెచ్చరిక
– తెలంగాణ భవన్‌కు లేఖ
టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును కాల్చి చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ భవన్‌కు ఓ లేఖ పంపారు.
ఇప్పటికే కేసీఆర్‌కు బెదిరింపు ఫోన్లు, లేఖలు వస్తున్నాయని పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. సోమవారం వచ్చిన ఈ లేఖ తీవ్ర కలకలం రేపింది. కాన్ఫిడెన్షియల్, అర్జంట్ అని ఉన్న కవర్‌పై కే చంద్రశేఖర్, తెలంగాణ భవన్, హైదారాబాద్, ఏపీ అని చిరునామా ఉంది. తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆ కవర్‌ను అక్కడి సిబ్బంది విప్పిచూడగా అందులో..
‘కేసీఆర్ నువ్వు పది రోజుల్లో కాల్చి చంపబడతావు -ఎల్ఈటీ ఆంధ్రా నక్సల్ (కేసీఆర్ యూ విల్ బీ షాట్ డెడ్ విత్ ఇన్ 10 డేస్ – ఎల్ఈటీ ఆంధ్రా నక్సల్) అని రాసి ఉంది. దీంతో ఆ పార్టీ నాయకులు కేసీఆర్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.