కేసీఆర్‌కిచ్చే భద్రత ఇదేనా?

-పేరుకే జెడ్ కేటగిరీ… ఇచ్చింది 1 8మంది సిబ్బందినే
– బుల్లెట్ ప్రూఫ్ కారు పరిస్థితి కూడా అధ్వాన్నం
– జెడ్ ప్లస్ భద్రతకు టీఆర్‌ఎస్ నేతల డిమాండ్
– మా నేతకు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండమే
– ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ నేతల హెచ్చరిక

కే చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆరాటమైన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 13ఏళ్లపాటు మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు. జనం మధ్య తిరుగుతూ తెలంగాణ కోసం గళాన్ని వినిపించిన రాజకీయ నాయకుడు. తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత కూడా తమదే అని చెబుతున్న కేసీఆర్ ఇప్పటికీ జనం మధ్యనే ఉంటున్నారు. ఇప్పటికీ ఆయన పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రకటన రూపంలో వచ్చిన తెలంగాణ.. బిల్లు రూపం సంతరించుకుని.. పార్లమెంటులో ఆమోదం పొందే దిశగా ఆయన కృషి చేస్తున్నారు. ఆయన జరిపిన తెలంగాణ పోరాటమే ఆయనను అనేక మందికి శత్రువును చేసింది. ప్రధానంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారిలో ఆయనపై ఉన్న కోపం అంతా ఇంతా కాదు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట వాళ్లు దీన్ని స్పష్టంగానే బయటపెడుతున్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ చేస్తున్న నినాదాలే ఇందుకు సాక్ష్యం. ఇది కొద్ది రోజులుగా మరింత వికృతరూపందాల్చింది. ఆఖరుకు కేసీఆర్‌ను చంపించేందుకు సుపారీ ఇచ్చే ప్రయత్నాలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు తమకు ఫోన్లు వచ్చినట్టు టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికీ దీనిపై టీఆర్‌ఎస్ నాయకులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్ అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) మహేందర్‌డ్డికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేసీఆర్‌కు ఎలాంటి హాని జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం…పోలీసుశాఖకు ఉన్నాయి. కానీ.. ఈ రెండూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం విశేషం. కేసీఆర్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించామని చెబుతున్న అధికారులు.. వాస్తవానికి ఆయనకు ఆ కేటగిరీలో 2 8 మంది అంగరక్షకులను కేటాయించాల్సి ఉన్నా.. కేవలం 1 8 మందితో సరిపెట్టారు. ఇక, ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలని టీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కేంద్ర హోంమంవూతితో మాట్లాడుతామని చెబుతున్నారు.

dogsquadవీవీవీఐపీలు, వీఐపీల భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాలను వాడుతారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వారి భద్రత కోసం నలభైమంది కమాండోలను కేటాయిస్తారు. వీరి వద్ద అత్యంత అధునాతనమైన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు ఉంటాయి. ఈ కమాండోలు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొంది ఉంటారు. అవసరమైన పక్షంలో తాము భద్రత కల్పిస్తున్న వీవీవీఐపీ, వీఐపీలను కాపాడటానికి నిరాయుధులుగా ఉండి సైతం పోరాటాలు చేయటంలో కూడా వీరికి ట్రెయినింగ్ ఇస్తారు. ఇక, జడ్ కేటగిరీలో ఉండే వీవీఐపీల భద్రత కోసం 2 8 మంది సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుంది.

ఎస్కార్టు కారుతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కేసీఆర్‌కు భద్రతను కల్పించటంలో ఈ నిబంధనలకు ఉన్నతాధికారులు నీళ్లొదిలారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి నలుగురు సిబ్బందిని కేటాయించాల్సి ఉండగా కేవలం ఇద్దరినే ఇచ్చారు. ఇక, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నలుగురు సిబ్బందిని ఇవ్వాల్సి ఉండగా ఇద్దరినే ఇచ్చారు. ఇంటి వద్ద భద్రత కోసం టెన్ ప్లస్ టూ ప్లస్ టూ అంటే 14 మంది సిబ్బందిని కేటాయించారు. అంటే మొత్తంగా 2 8 మంది సిబ్బందిని భద్రత కోసం ఇవ్వాల్సి ఉండగా కేవలం 1 8మందినే ఇచ్చారు. జెడ్ కేటగిరీ భద్రత నిబంధనల ప్రకారం కేసీఆర్ వెంట నిత్యం ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఉండాలి. అయితే, కేసీఆర్‌కు మాత్రం హెడ్‌కానిస్టేబుల్‌ను కేటాయించటం గమనార్హం. బుల్లెట్ ప్రూఫ్ పరిస్థితి కూడా ఏమాత్రం బాగా లేదు. ఇంతకు ముందు ఎవరో వాడిన పాత బుల్లెట్ ప్రూఫ్ కారునే కేటాయించారు. దీనిపై టీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్‌కు జరగరానిది ఏదైనా జరిగితే యావత్ తెలంగాణ భగ్గుమనటం ఖాయమని తెలంగాణవాదులు అంటున్నారు. కేసీఆర్‌కు ఏదైనా జరిగితే తెలంగాణ మొత్తం అగ్గిగుండంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణవాసుల దశాబ్ధాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్‌పై ఈగ వాలినా ఎవ్వరూ సహించరని చెబుతున్నారు. ఆ తరువాత ఏర్పడే పరిణామాలకు ప్రభుత్వం, పోలీసుశాఖలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్‌ను చంపించాలనే కుట్ర వెనక సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే ఉండి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం కోసం పదమూడేళ్లుగా కేసీఆర్ రాజీ లేని పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను, విమర్శలను భరించారు. శత్రువులు పెరుగుతున్నా తెలంగాణ సాధనే లక్ష్యంగా సాగారు. ఉద్యమం ఫలించి, తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవటం, ఆ మేరకు చర్యలు చేపట్టాలని యూపీఏ సర్కార్‌ను కోరటం కేసీఆర్‌కు మరింతమంది శత్రువులను పెంచింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల బెంగళూరు నుంచి టీఆర్‌ఎస్‌లోని కొంతమంది ముఖ్య నేతలకు వచ్చిన ఫోన్‌కాల్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఫోన్ చేసిన వ్యక్తి కేసీఆర్‌ను చంపించేందుకు కొంతమంది సుపారీ ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పటంతో వెంటనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లు విషయాన్ని అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) మహేందర్‌డ్డి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదును కూడా అందచేయనున్నారు.

ఏమైనా జరిగితే ఊహించలేని పరిణామాలు : హరీష్‌రావు
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రూపం ఇచ్చిన కేసీఆర్‌కు ఏమైనా జరిగితే తెలంగాణలో జరిగే పరిణామాలు ఊహకు కూడా అందవని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, సమైక్యవాదుల పాలిట సింహస్వప్నంగా మారిన కేసీఆర్‌ను తుదముట్టించి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఆపాలని కొందరు పెట్టుబడిదారులు చూస్తున్నారని, నిజంగానే ఏమైనా జరిగితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేమని తెలిపారు. కేసీఆర్‌పై కుట్ర పన్నడం దుర్మార్గం, అమానుషమని అన్నారు. కేసీఆర్‌కు వెంటనే రక్షణ చర్యలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని, సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను తిప్పికొ సిద్ధమవుతున్న ప్రజలు, యువకులు కేసీఆర్‌కు ఏమైనా జరిగితే తట్టుకోలేని పరిస్థితి ఉంటుందని తెలిపారు.

లక్షలాది మందికి కేసీఆర్ హీరో : జగదీష్‌డ్డి
కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల రూపమని, ఈ సమయంలో ఆయన హత్యకు కుట్ర పన్నడం దుర్మార్గమైనదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీష్‌డ్డి అన్నారు. దేశంలో నాయకుల హత్యలు జరిగినప్పుడు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, నిజంగా కేసీఆర్‌కు ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా.. దేశం ఎన్నడూ చూడని పరిణామాలను చూస్తుందని హెచ్చరించారు. వెంటనే కుట్ర పన్నిన వారిని గుర్తించాలని, అందుకు వేగవంతమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు ఇచ్చామని, వెంటనే పోలీసులు లోతుగా విచారణ జరిపాలని కోరారు. కేసీఆర్‌కు అవసరమైన భద్రతను కేటాయించాలని కోరారు.

కేసీఆర్‌కు ఏమైనా జరిగితే తట్టుకోలేరు : రామలింగాడ్డి
కేసీఆర్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుందని టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగాడ్డి అన్నారు. రాష్ట్రం సాధించే సమయంలో కేసీఆర్‌ను అంతం చేయాలనుకోవడం సీమాంధ్ర పెట్టుబడిదారుల దుర్మార్గ చర్యలకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణ వీరుడిగా ఉన్న కేసీఆర్‌ను కాపాడుకునేందుకు యావత్తు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు.

అది ఉద్యమంపై హత్యాయత్నమే : ఉద్యోగ జేఏసీ
కేసీఆర్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న వార్తలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని ఈ దశకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని జేఏసీ చైర్మన్ జీ దేవీవూపసాద్ పేర్కొన్నారు. కేసీఆర్ హత్యకు కుట్ర పన్నడం తెలంగాణ ఉద్యమాన్ని హత్య చేయడానికి ప్రయత్నించడమేనన్నారు. ‘కేసీఆర్ ఒక వ్యక్తి కాదు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల శక్తి. కేసీఆర్‌పై హత్యాయత్నాన్ని ప్రజాస్వామికవాదులందరూ తీవ్రంగా ఖండించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు సరైన భద్రత కల్పించాలని, ఎలాంటి పరిణామాలకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలని దేవీవూపసాద్ పేర్కొన్నారు.

రాష్ట్రం అగ్ని గుండమవుతుంది: శ్రీనివాస్‌గౌడ్
కేసీఆర్‌కు ఏ హాని జరిగినా రాష్ట్రం అగ్ని గుండమవుతుందని ఉద్యోగ జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. వచ్చిన తెలంగాణను సీమాంధ్ర నేతలు గతంలో డబ్బు, పలుకుబడి ఉపయోగించి వెనక్కుపోయేలా చేశారన్నారు. ఈసారి అవి ఫలించకపోవడంతో చివరి ప్రయత్నంగా కేసీఆర్‌ను హత్య చేయాలన్న ఆలోచన వచ్చిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ‘నిప్పు లేనిదే పొగరాదు. కేసీఆర్‌పై హత్యాయత్నానికి సంబంధించి వచ్చిన వార్తలపై సమగ్ర విచారణ జరిపించాలి. దోషులను శిక్షించాలి’ అని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.