కేవీపీ ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ

తెలంగాణకు అడ్డుపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేవీపీ ఇంటిని ఓయూ జేఏసీ విద్యార్థులు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని, కాంగ్రెస్ జెండా గద్దెలను కూల్చివేయాలని పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.